అతిగా పిరికారీ చేస్తే అనర్థం | crops damaged with over spraying of pesticides | Sakshi
Sakshi News home page

అతిగా పిరికారీ చేస్తే అనర్థం

Published Wed, Sep 14 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

పత్తి పంటకు పురుగుమందు పిచికారీ చేస్తున్న రైతు

పత్తి పంటకు పురుగుమందు పిచికారీ చేస్తున్న రైతు

పురుగుమందుల కొనుగోలు, వాడకంపై జాగ్రత్తలు పాటించాలి
జహీరాబాద్‌ ఏడీఏ వినోద్‌కుమార్‌

 

జహీరాబాద్‌ టౌన్‌: తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగు మందులు పిచికారీ చేస్తాం. అయితే, వాటి కొనుగులుతో పాటు వాడకంలోనూ రైతులు జాగ్రత్తలు పాటించాలని జహీరాబాద్‌ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్‌(ఫోన్‌: 72888 94426) పేర్కొన్నారు. పంటలకు విచక్షణ రహితంగా పురుగు మందులు పిచకారి చేసినా ప్రమాదకరమని హెచ్చరించారు. మందులు కొనుగోలు చేసే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మందుల కొనుగోలులో మెలకువలు

  • లైసెన్సు కలిగిన అధీకత డీలర్‌ వద్దే పురుగుమందులు కొనుగోలు చేయాలి.
  • మందుల ప్యాకింగ్‌, డబ్బాలపై తయారీ తేది, గడువు పరిశీలించాలి.
  • గడువు దాటిన ముందులను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోవద్దు.
  • నిర్ణీత ప్యాకింగ్, సీల్‌ ఉన్న ముందులనే కొనుగోలు చేయాలి.
  • లీకేజీతో ఉన్న డబ్బాలను తీసుకోవద్దు.
  • కొనుగోలు చేసే ముందు రశీదు, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
  • బిల్లులో మందు పేరు, కంపెనీ వివరాలు, బ్యాచ్‌ నంబర్‌, రైతు సంతకం మొదలైనవి ఉండాలి.
  • రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది.
  • మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన మందులను కొనేముందు వ్యవసాయ అధికారులను సంప్రదించడం ఉత్తమం.

పిచికారీలో జాగ్రత్తలు

  • సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి, సిఫార్సు చేసిన మందులను మాత్రమే పంటలకు పిచికారీ చేయాలి.
  • అవసరాన్ని బట్టే మందులను మందులు వాడాలి.
  • తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే సస్యరక్షణ మందులు, బయోఫెస్టిసైడ్‌ మందులను మాత్రమే వాడాలి.
  • వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో, సరైన సమయంలో, సరైన స్ర్పేయర్‌ ఉపయోగించాలి.
  • పంటలను కోసే ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు.
  • పురుగు మందులను చల్లిన చోట పశువులను మేతకు తీసుకెళ్లరాదు.
  • పురుగుమందు ఉపయోగించిన స్ప్రేయర్‌లను తాగు నీటి చెరువులు, కుంటల్లో శుభ్రం చేయరాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement