spraying
-
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
పాలీహౌస్‌ల కోసం రోబోటిక్ స్ప్రేయర్
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల పిచికారీకి సాంకేతిక పరిజ్ఞానం జోడించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రోబోటిక్ స్ప్రేయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో పాలీహౌస్, గ్రీన్ హౌస్‌లలో ద్రవ రూప ఎరువులు, పురుగు మందులను మానవ రహితంగా పిచికారీ చేయొచ్చు. పంటల వారీగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే నానో యూరియా, పురుగు మందులను ఈ పరికరం పిచికారీ చేస్తుంది. దీనిద్వారా 20 శాతం యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు 25 శాతం వరకు ఆదా అవుతాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. దిగుబడుల్లో నాణ్యత పెరగడంతోపాటు పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాల ప్రభావం ఉండదని కూడా తేల్చారు. ప్రత్యేకతలివీ.. ♦ ఈ పరికరం రిమోట్ కంట్రోల్‌తో కిలోమీటర్ మేర పనిచేస్తుంది. ♦ ముందుగా కావాల్సిన రసాయన ఎరువు లేదా పురుగు మందులను తొట్టిలో వేసుకుని మెషిన్ ఆన్ చేసి రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ను కనెక్ట్ చేసుకోవాలి. ♦ రిమోట్ ద్వారా కమాండ్ సిగ్నల్స్‌ను అందిస్తే ఇది పని చేసుకుంటూ పోటుంది. రిమోట్ ద్వారా మెషిన్ దిశను మార్చుకోవచ్చు. ♦ కంట్రోలర్ బటన్ ద్వారా మెషిన్ వేగం, స్ప్రేయర్ పీడనం మార్చుకోవచ్చు. ♦ మొక్క ఎత్తును బట్టి నాజిల్స్ను మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. ♦ పురుగు మందులను ఏకరీతిన సరైన పరిమాణంతో ఆకుల మీద పడేలా చేయటం దీని ప్రత్యేకత. ♦ తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పురుగు మందుల వృథాతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవచ్చు. ♦ 10–20 లీటర్ల లిక్విడ్ యూరియా, పురుగుల మందులను మోసుకెళ్తూ నిమిషానికి 6 లీటర్లను పిచికారీ చేయగల సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. కృత్రిమ మేధస్సుతో.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలు, మొబైల్ అప్లికేషన్స్, సెన్సార్లు, డ్రోన్స్, ఆటోమేటిక్ యంత్ర పరికరాలు, వివిధ సాఫ్ట్వేర్స్ రూపకల్పన కోసం ఆదికవి నన్నయ, జేఎన్టీయూకే, ఎన్ఐటీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రోటోటైప్ రోబోటిక్ స్ప్రేయర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మార్పుచేసి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా మొక్కల వ్యాధులు, తెగుళ్లను గుర్తించడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
Drone: ఎకరాకు 6 నిమిషాల్లో మందుల పిచికారీ
మామూలుగా పంట చేనుకు రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లుతారు. అయితే దీనికి అధిక సమయం తీసుకోవడమే గాక, కూలీలకు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి రైతులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి సూచించారు. డ్రోన్‌తో ఎకరాకు కేవలం రూ.550 తోనే 6 నిమిషాల్లో మందుల పిచికారీ పూర్తవుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో రంగధాంపల్లిలో ఉన్న తన పొలంలో డ్రోన్‌తో మందును పిచికారీ చేయించారు. జిల్లా రైతులంతా ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
ప్రత్యేక యంత్రాలతో రసాయనాల స్ప్రే
-
డ్రోన్‌తో పురుగుమందు పిచికారీ
హైదరాబాద్ : డ్రోన్ ద్వారా పురుగుమందు పిచికారీ చేసే విధానాన్ని గురువారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శించారు. సెన్స్‌కర్ సంస్థ సహకారంతో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రయోగాత్మకంగా ఈ డెమో ఏర్పాటు చేశారు. పది లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును డ్రోన్‌కు అమర్చి రిమోట్ సహాయంతో జీపీఎస్, జీఐఎస్ పరిజ్ఞానం వినియోగించి స్ప్రే ఎలా చేయాలి? ఎంత మోతాదులో పురుగుమందు వాడాలి? తదితర అంశాలను పరిశీలించారు. ఈ ప్రదర్శనను వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ జగదీశ్వర్, వరి పరిశోధనా కేంద్రం హెడ్ డాక్టర్ ప్రదీప్, వరి విభాగం శాస్త్రవేత్తలు, ప్లాంట్ ప్రొటెక్షన్ విభాగంలోని శాస్త్రవేత్తలు, యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, అధ్యాపకులు పరిశీలించారు. -
జబ్బు నయం చేస్తానంటూ.. కళ్లలో స్ప్రే
కేప్ టౌన్ (పోలోక్వేన్) : దక్షిణాఫ్రికాకు చెందిన వివాదాస్పద ప్రవక్త లిథేబో రబాలగో భవితవ్యం సోమవారం తేలనుంది. ఇంట్లో కీటకాలను చంపడానికి ఉపయోగించే విషపూరితమైన స్ప్రేలను ప్రజల కళ్లు, మొహాల్లో స్ప్రే చేయడం ఆపాలంటూ లింపోపో ప్రావిన్స్ ఆరోగ్య శాఖ విభాగం హైకోర్టును ఆశ్రయించింది. స్పందించిన హైకోర్టు వెంటనే కీటకాల సంహారానికి ఉపయోగించే స్ప్రేలను ప్రజలపై ఉపయోగించొద్దంటూ లిథేబో రబాలగో ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సోమవారం హాజరు కావాలని కోర్టు నోటీసుకూడా పంపినట్టు లింపోపో ఆరోగ్య శాఖ విభాగం అధికారప్రతినిధి డెర్రిక్ తెలిపారు. తనకు అతీత శక్తులున్నాయంటూ ఎయిడ్స్, క్యాన్సర్లతో పాటూ వివిధ జబ్బులతో బాధపడుతున్నవారి వ్యాధులను నయం చేస్తానని లిథేబో రబాలగో ప్రకటించుకున్నాడు. పెద్ద ఎత్తున వచ్చిన బాధితుల కళ్లలో, మొహంపై పురుగుల మందును స్ప్రే చేసేవాడు. దీంతో లిథేబో రబాలగో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. కళ్లలో, మొహంపై స్ప్రే చేసుకోవడం హానికరమని సదురు స్ర్పే కంపెనీ కూడా ప్రజలను హెచ్చరించింది. 'ఈ సంఘటన చూస్తుంటే నా గుండె పగిలిపోయింది. బాధితులు తమ జీవితాల్లో మార్పు కోసం ఎవరు ఏది చెప్పినా వినడం చాలా బాధాకరం' అని దక్షిణాఫ్రికా ప్రముఖ నటి బోయిటీ తులో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
అతిగా పిరికారీ చేస్తే అనర్థం
పురుగుమందుల కొనుగోలు, వాడకంపై జాగ్రత్తలు పాటించాలి జహీరాబాద్ ఏడీఏ వినోద్‌కుమార్ జహీరాబాద్ టౌన్: తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగు మందులు పిచికారీ చేస్తాం. అయితే, వాటి కొనుగులుతో పాటు వాడకంలోనూ రైతులు జాగ్రత్తలు పాటించాలని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్(ఫోన్: 72888 94426) పేర్కొన్నారు. పంటలకు విచక్షణ రహితంగా పురుగు మందులు పిచకారి చేసినా ప్రమాదకరమని హెచ్చరించారు. మందులు కొనుగోలు చేసే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మందుల కొనుగోలులో మెలకువలు లైసెన్సు కలిగిన అధీకత డీలర్ వద్దే పురుగుమందులు కొనుగోలు చేయాలి. మందుల ప్యాకింగ్, డబ్బాలపై తయారీ తేది, గడువు పరిశీలించాలి. గడువు దాటిన ముందులను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోవద్దు. నిర్ణీత ప్యాకింగ్, సీల్ ఉన్న ముందులనే కొనుగోలు చేయాలి. లీకేజీతో ఉన్న డబ్బాలను తీసుకోవద్దు. కొనుగోలు చేసే ముందు రశీదు, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లులో మందు పేరు, కంపెనీ వివరాలు, బ్యాచ్ నంబర్, రైతు సంతకం మొదలైనవి ఉండాలి. రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మందులను కొనేముందు వ్యవసాయ అధికారులను సంప్రదించడం ఉత్తమం. పిచికారీలో జాగ్రత్తలు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి, సిఫార్సు చేసిన మందులను మాత్రమే పంటలకు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టే మందులను మందులు వాడాలి. తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే సస్యరక్షణ మందులు, బయోఫెస్టిసైడ్ మందులను మాత్రమే వాడాలి. వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో, సరైన సమయంలో, సరైన స్ర్పేయర్ ఉపయోగించాలి. పంటలను కోసే ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు. పురుగు మందులను చల్లిన చోట పశువులను మేతకు తీసుకెళ్లరాదు. పురుగుమందు ఉపయోగించిన స్ప్రేయర్లను తాగు నీటి చెరువులు, కుంటల్లో శుభ్రం చేయరాదు.