హైదరాబాద్ : డ్రోన్ ద్వారా పురుగుమందు పిచికారీ చేసే విధానాన్ని గురువారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శించారు. సెన్స్‌కర్ సంస్థ సహకారంతో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రయోగాత్మకంగా ఈ డెమో ఏర్పాటు చేశారు. పది లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును డ్రోన్‌కు అమర్చి రిమోట్ సహాయంతో జీపీఎస్, జీఐఎస్ పరిజ్ఞానం వినియోగించి స్ప్రే ఎలా చేయాలి? ఎంత మోతాదులో పురుగుమందు వాడాలి? తదితర అంశాలను పరిశీలించారు. ఈ ప్రదర్శనను వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ జగదీశ్వర్, వరి పరిశోధనా కేంద్రం హెడ్ డాక్టర్ ప్రదీప్, వరి విభాగం శాస్త్రవేత్తలు, ప్లాంట్ ప్రొటెక్షన్ విభాగంలోని శాస్త్రవేత్తలు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, అధ్యాపకులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment