సాగు బాగేనా? | cultivation in trouble | Sakshi
Sakshi News home page

సాగు బాగేనా?

Published Sat, Aug 20 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

నీరు లేక ఎండిన వరి పంట

నీరు లేక ఎండిన వరి పంట

  • సాధారణం కన్నా తక్కువ వర్షాలు
  • విస్తీర్ణంలో సగం ఎండుముఖం
  • అయోమయంలో రైతాంగం
  • నర్సాపూర్‌: సాధారణ వర్షపాతం కన్నా తక్కువ  వర్షాలు కురవడంతో  సాధారణ సాగు విస్తీర్ణం కన్నా తక్కువ సాగు చేసినప్పటికీ సాగు చేసిన పంటలు ఎండు ముఖం పట్టాయి. వర్షాకాలం సీజన్‌లో మూడు నెలలు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నందున  రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

    జూన్‌, జూలైలో అంతో ఇంతో వర్షాలు కురవడంతో ఆయా పంటలు సాగు చేయగా ప్రస్తుతం వర్షాలు కురవ నందున అన్ని రకాల పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు  వృధా అయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   వర్షాలు లేక వరి నాట్లు వేయకపోవడంతో  నారుమళ్లు చాలా చోట్ల  ఎండుతున్నాయి. 

    కాగా మొక్కజొన్న ,జొన్న తదితర  వర్షాధార పంటలు సైతం ఎండుతున్నాయి. నియజకవర్గంలో వర్షాలతో పాటు బోరు బావులపై  ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు లేక చెరవులు కుంటలు నిండక పోవడంతో ఆయకట్టు భూములు ఇప్పటికే బీడు భూములుగా మారాయి. కాగా బోరు బావుల కింద సాగు చేసినప్పటికీ బోర్ల నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ పంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి.

    నర్సాపూర్‌ మండలంలో తక్కువ వర్షాలు తక్కువ సాగు
    మండలంలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి. మొదట్లో వర్షాలు కురవడంతో చాలా చోట్ల వరి, మొక్కజొన్న, జొన్న కంది తదితర పంటలు సాగు చేశారు.  కాగా వరి 2681హెక్టార్ల సాధారణ  సాగు విస్తీర్ణం కాగా 1112 హెక్టార్లు నాటు వేయగా  మొక్కజొన్న సాధారణం కన్నా  సుమారు మూడు వందల హెక్టార్లు ఎక్కువ విస్తీర్ణంలో విత్తనం వేశారు.  

    కౌడిపల్లి మండలంలో అధ్వానం
    మండలంలో మూడు నెలల్లో 700మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా 295 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడంతో  సాగు సైతం  తక్కువగా నమోదైంది.   మండలంలో వరి 4500   ఎకరాలలో సాగు చేయాల్సి ఉండగా 1200  ఎకరాల్లో మాత్రమే   వేశారు.  మొక్కజొన్న  ఐదు  ఎకరాలకు గాను 3125 ఎకరాల్లో  వేయగా, కంది రెండు వేల ఎకరాలకుగాను 1550   ఎకరాల్లో, జొన్న మూడు వందల  ఎకరాలకు గాను 150  ఎకరాల్లో సాగు చేశారు.

    కాగా  సాధారణ సాగు విస్తీర్ణంలో సగానికి తక్కువ పంటలే సాగు చేయగా వర్షాలు లేక సాగు చేసిన పంట పొలాల్లో చాలా మటుకు ఎండు ముఖం పట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   వెల్దుర్తి మండలంలో సగానికి సగం పంటలు ఎండిపోతున్నాయి.  మండలంలో  ఇప్పటి వరకు మూడు నెలల కాలంలో 635 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 248 మిల్లీ మీటర్ల వర్షపాతమే కురిసింది. 

    కాగా పంటలు సైతం సగానికి పైగా ఎండుముఖం పట్టాయి.మ ండలంలో వరి పంటను 2026 హెక్టార్లకు గాను 1280 హెక్టార్లలో మాత్రమేసాగు  చేయగా అందులో 40 శాతం ఎండిందని తెలిసింది. కాగా మొక్కజొన్న  730 హెక్టార్లలో సాగు చేయగా అందులో సగం  ఎండుముఖం పట్టిందని తెలిసింది.

    కొల్చారం మండలంలో సైతం సాగు అధ్వానంగా ఉంది. మండలంలో మూడు నెలల కాలంలో 620 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 329 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  మండలంలో వరి, మొక్కజొన్న తదితర పంటలను 5700హెక్టార్లలో సాగు చేయాల్సి ఉ‍ండగా 4748 హెక్టార్లలో సాగు చేసినప్పటికీ, సగం పంటలు ఎండిపోయాయి.

    హత్నూర మండలంలో సాధారణంలో సగమే..
    మండలంలో సాధారణ వర్షపాతంలో సగం వర్షాలు కురిశాయి. జూన్‌ నెలలో 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 129 మిల్లీమీటర్లు. జూలై నెలలో 237కు గాను 171మి.మీ,   ఆగస్టులో 221 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

    వరి  సుమారు 3480 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా మండలంలో 1756 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేయగా, మొక్కజొన్న పంటను 633 హెక్టార్లలో విత్తనం వేయాల్సి ఉండగా వర్షాలు తక్కువగా ఉన్నందున ఎక్కువ మంది రైతులు విత్తనం వేయడంతో 1086 హెక్టార్లలో విత్తనం వేసినట్లు నమోదైంది. శివ్వంపేట మండలంలో సైతం పరిస్థితులు అధ్వానంగానే ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement