అంతర్జాతీయంగా ధరలు పడిపోతున్నందువల్ల పత్తి ఉత్పత్తి లాభదాయం కాదని, పత్తి స్థానంలో పప్పు ధాన్యాలను పండించడం మేలని మంత్రి జగదీశ్ రెడ్డి రైతులకు సూచించారు.
సూర్యాపేట: అంతర్జాతీయంగా ధరలు పడిపోతున్నందువల్ల పత్తి ఉత్పత్తి లాభదాయం కాదని, పత్తి స్థానంలో పప్పు ధాన్యాలను పండించడం మేలని మంత్రి జగదీశ్ రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పిల్లాయిపాలెంలో జిల్లా స్థాయి రైతు అవగాహన సదస్సును మంత్రి.. ఆమేరకు రైతులను ప్రోత్సహిస్తామన్నారు.
పత్తిని అధికంగా దిగుమతి చేసుకునే చైనా తాజాగా దిగుమతులపై నిషేధం విధించిచడంతో పత్తి ధరలు విపరీతంగా పడిపోయాయని మంత్రి చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలో లక్ష హెక్టార్లలో పత్తి పంటకు బదులు పప్పు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు.