30 నుంచి దసరా సెలవులు
Published Fri, Sep 9 2016 10:38 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 12 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు డీసీఈబీ చైర్మన్, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 13వతేదీన స్కూళ్లు పునఃప్రారంభమవుతాయన్నారు.
21 నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు
ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 పరీక్షలు నిర్వహించాలని డీఈఓ.. హెచ్‌ఎంలను ఆదేశించారు. ఒకటి నుంచి 5వ తరగతి పరీక్షలను ఈ నెల 24 నుంచి 28 వరకు జరపాలన్నారు. ఈ నెల 18 నుంచి ప్రధానోపాధ్యాయులు తమకు కేటాయించిన కీ సెంటర్ల నుంచి ప్రశ్న పత్రాలు పొందాలన్నారు. యూపీ స్కూⶠ్లకు సంబంధించి ఈ నెల 18 నుంచి, ప్రై మరీ స్కూళ్లకు 21వ తేదీ నుంచి ప్రశ్నపత్రాలను ఎంఈఓల నుంచి పొందాలన్నారు. హైస్కూళ్లలో ప్రశ్నపత్రాల ప్యాకెట్‌లను పరీక్షలకు పదిహేను నిమిషాల ముందు మాత్రమే ఓపెన్ చేయాలన్నారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాల బండిళ్లను వారికి సంబంధించిన ఎంఈఓలకు అప్పగించాలన్నారు.
Advertisement