రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
– డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేట్ యాజమాన్య ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ నెల 30 నుంచి ఆక్టోబర్ 12వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించినట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తిరిగి పాఠశాలలను అక్టోబర్ 13న పునః ప్రారంభించాలని సూచించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరైన ప్రభుత్వ నిబంధలను అతిక్రమించి సెలవుల్లో పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.