అప్పుల బాధలు తాళలేక.. | Debts taken life | Sakshi
Sakshi News home page

అప్పుల బాధలు తాళలేక..

Published Thu, Nov 3 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

Debts taken life

వ్యక్తి ఆత్మహత్య
 
గుంటూరు రూరల్‌: ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కొడుకు పట్టించుకోకపోవటంతో మనస్తాపానికి గురైన వ్యక్తి నగర శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సంగడిగుంట హిడాంబినగర్‌ 6వలైనుకు చెందిన కల్లూరి శివశంకరరావు(47) వడ్రంగం పనిచేస్తుంటాడు. ఆతను మూడు వివాహాలు చేసుకోగా వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం తన తల్లి,  కొడుకుతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం నగర శివారుల్లో అప్పు చేసి ఒక స్థలం కొనుగోలు చేశాడు.   అప్పులవాళ్ళు రుణం చెల్లించాలని వత్తిడి చేయడం, దీనికి తోడు తల్లి, కొడుకు తనను సరిగా పట్టించుకోవటలేదని శివశంకరరావు మానసిక వత్తిడికి గురయ్యాడు.  దీంతో గురువారం ఉదయం 5 గంటలప్రాంతంలో ఇంటినుంచి బయటకు వచ్చి నగర శివారుల్లో సాయిట్రస్ట్‌ సమీపంలోగల ప్లాట్లలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   విషయం తెలిసిన  నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుని పరిశీలించగా మృతుని ప్యాంటు జేబులో సూసైడ్‌ నోట్‌ దొరికింది. ఆర్థిక ఇబ్బందులు, తన తల్లి, కొడుకు పట్టించుకోవక పోవటంతో మానసిక వత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డానని, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌లో రాశాడని పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement