వచ్చేనెల 9 నుంచి దివ్యాంగుల వారోత్సవాలు | december 9 intenational disabled day | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 9 నుంచి దివ్యాంగుల వారోత్సవాలు

Published Tue, Nov 22 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

వచ్చేనెల 9 నుంచి దివ్యాంగుల వారోత్సవాలు

వచ్చేనెల 9 నుంచి దివ్యాంగుల వారోత్సవాలు

రాజమహేంద్రవరం రూరల్‌ : 57వ అంతర్జాతీయ దివ్యాంగుల వారోత్సవాలు డిసెంబర్‌ తొమ్మిదిన రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్యమైదానంలో నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల మహా సంఘట రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముత్యాల పోసికుమార్, మదర్‌థెరిస్సా దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కోలమూరు గ్రామంలో దివ్యాంగుల సంక్షేమసంఘం జిల్లాస్థాయి కార్యవర్గం సమావేశం జరిగింది. పోసికుమార్, సత్యనారాయణ మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 98858 64940, 99494 75686, 98496 40432 నెంబర్లకు చేసి నమోదు చేసుకోవాలని తెలిపారు. అంతకు ముందు దివ్యాంగుల వారోత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు.పెద్దాపురం  గునపర్తి కొండలరావు, బోజంకి శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement