ఫిరాయింపుదారులకు మంత్రి పదవులా!
ఫిరాయింపుదారులకు మంత్రి పదవులా!
Published Sat, Apr 8 2017 12:52 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయటమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇస్తారా.. సిగ్గులేదా చంద్రబాబూ’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ, ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ.. ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి.. ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును నిరసిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ వైస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. పెనుమంట్ర మండలం మార్టేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆళ్ల నాని మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులను అరికట్టాల్సి న రాష్ట్ర గవర్నర్ సైతం చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పార్టీ చట్ట ప్రకారం వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆచంట నియోజకవర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నగర శాఖ అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, ఏలూరు మండల శాఖ అధ్యక్షుడు మంచెం మైబాబు నాయకత్వం వహించారు. కొయ్యలగూడెంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆ«ధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పాలకొల్లులో నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తొలుత మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తహసీ ల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్, పోలీస్ ఐలండ్ మీదుగా జయలక్ష్మి థియేటర్ సెంటర్ వరకు కొనసాగి తిరిగి తాలూకా ఆఫీస్ సెంటర్‌కు చేరింది. కొవ్వూరులో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తొలుత మెరకవీధిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, ఏఎంసీ మాజీ చైర్మన్ బండి పట్టాభిరామారావు (అబ్బులు) పాల్గొన్నారు. ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు నాయకత్వంలో మో టార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నార్పీ అగ్రహారంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారి మీదుగా తహసీ ల్దార్ కార్యాలయానికి చేరింది. భీమవరంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు మోటా ర్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రకాశం చౌక్‌లో నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు, మునిసిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు పాల్గొన్నారు. చింతలపూడిలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, పార్టీ మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఆధ్వర్యంలో బోసు బొమ్మసెంటర్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహిం చారు. దెందులూరులో మానవహారం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. పార్టీ దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాల కన్వీనర్లు బొమ్మనబోయిన నాని, అప్పన ప్రసాద్, మెట్లపల్లి సూరిబాబు నేతృత్వంలో మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిడదవోలులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట «నిరసన వ్యక్తం చేశారు. తొలుత పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దిపాటి ఫణీంద్ర నేతృత్వంలో శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో నారాయణపురం నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తణుకులో పార్టీ సీనియర్ నాయకుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ బలగం సేతుబంధన సీతారామ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గోపాలపురం వైఎస్సార్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. అనంతరం మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పటమటి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement