
108 వాహనంలో మహిళ ప్రసవం
కుల్కచర్ల: ఓ నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో 108 వాహనంలో ప్రసవం జరిగింది. వివరాలు.. మండల పరిధిలోని లింగంపల్లి వాల్యనాయక్ తండాకు చెందిన కవిత నిండు గర్భిణి. ఆమెను ప్రసవం కోసం ఆదివారం 108 వాహనంలో కుల్కచర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. కవిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ కృష్ణ, పైలట్ అక్బర్ తెలిపారు.