woman delivered
-
108 వాహనంలో మహిళ ప్రసవం
కుల్కచర్ల: ఓ నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో 108 వాహనంలో ప్రసవం జరిగింది. వివరాలు.. మండల పరిధిలోని లింగంపల్లి వాల్యనాయక్ తండాకు చెందిన కవిత నిండు గర్భిణి. ఆమెను ప్రసవం కోసం ఆదివారం 108 వాహనంలో కుల్కచర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. కవిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ కృష్ణ, పైలట్ అక్బర్ తెలిపారు. -
108 వాహనంలో మహిళ ప్రసవం
తంగెడ: గర్భిణిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగెడ గ్రామ సమీపంలో 108 వాహనంలో బుధవారం ఓ మహిళ ప్రసవించింది. తంగెడకు చెందిన డేరంగుల లక్ష్మీదుర్గా ప్రసవవేదన పడుతుండటంతో 108 వాహనం ద్వారా దాచేపల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్నారు. గ్రామం దాటిన రెండు కిలోమీటర్ల తరువాత లక్ష్మీదుర్గాకు పురిటినోప్పులు అధికమయ్యాయి. దీంతో 108 వాహనంలోనే లక్ష్మీదుర్గా మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. 108 సిబ్బంది నాగరాజు, నారాయణ స్రసవ సమయంలో వైద్య సేవలు అందించారు. ప్రసవం తరువాత తల్లి, బిడ్డలను దాచేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
తుని రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
తుని(తునిరూరల్), న్యూస్‌లైన్ : తుని రైల్వేస్టేషన్లో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. పుట్టిన కవలలు పురిట్లోనే చనిపోవడంతో విషాదం నెలకొంది. తుని ఆశ్రమ వీధికి చెందిన రాయిపాటి ఏసమ్మ అనే ఆరు నెలల గర్భిణి బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి వైద్యపరీక్షలకు వచ్చింది. ఆమెకు రక్తం లేకపోవడాన్ని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విష్ణువర్థని గుర్తించారు. వెంటనే కాకినాడ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కాకినాడ వెళ్లేందుకు ఏసమ్మ రైలుకోసం స్థానిక స్టేషన్‌కు వెళ్లింది. అంతలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. గమనించిన ప్రయాణికులు రైల్వే ఆస్పత్రి వర్గాలకు ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఎవ్వరూ స్పందించకపోవడంతో సమీపంలో ఉన్న కోటనందూరు పీహెచ్సీ సూపర్వైజర్ సరోజని సహాయంతో చీరలతో గదిని ఏర్పాటు చేశారు. ఏసమ్మ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే జన్మించేసరికే ఇద్దరు పిల్లలు చనిపోయారు. అనంతరం 108లో బాలింతను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏసమ్మకు ‘ఓ’ నెగిటివ్ రక్తం అవసరమని, నెలలు నిండకుండా ప్రసవం కావడంతో బిడ్డలు మృతి చెందారని సూపరింటెండెంట్ విష్ణువర్థని, డాక్టర్ రవిచంద్రలు తెలిపారు.