108 వాహనంలో మహిళ ప్రసవం | woman gave birth to boy child in 108 | Sakshi
Sakshi News home page

108 వాహనంలో మహిళ ప్రసవం

Published Thu, Dec 24 2015 12:58 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

108 వాహనంలో మహిళ ప్రసవం - Sakshi

108 వాహనంలో మహిళ ప్రసవం

తంగెడ: గర్భిణిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగెడ గ్రామ సమీపంలో 108 వాహనంలో బుధవారం ఓ మహిళ ప్రసవించింది. తంగెడకు చెందిన డేరంగుల లక్ష్మీదుర్గా ప్రసవవేదన పడుతుండటంతో 108 వాహనం ద్వారా దాచేపల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్నారు.

గ్రామం దాటిన రెండు కిలోమీటర్ల తరువాత లక్ష్మీదుర్గాకు పురిటినోప్పులు అధికమయ్యాయి. దీంతో 108 వాహనంలోనే లక్ష్మీదుర్గా మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. 108 సిబ్బంది నాగరాజు, నారాయణ స్రసవ సమయంలో వైద్య సేవలు అందించారు. ప్రసవం తరువాత తల్లి, బిడ్డలను దాచేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement