ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి | Demand about ST commission | Sakshi
Sakshi News home page

ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

Published Sun, Sep 25 2016 9:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఎస్టీ కమిషన్‌ వేసి తమ సమస్యలు పరిష్కరించాలని స్టద్వా (షెడ్యూల్‌ ట్రైబల్స్‌ అవేర్‌నెస్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌) అధ్యక్షుడు ఎం.కొండలరావు డిమాండ్‌ చేశారు. కొత్తపేటలోని స్టద్వా కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కొండలరావు మాట్లాడుతూ.. ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుచేయడమే కాక గిరిజనులకే గిరిజన మంత్రిత్వ శాఖ కేటాయించి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు మాట్లాడుతూ.. గిరిజనుల ఆస్తులను ఆక్రమించినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.  కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపి అమలయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement