మన్యంలో డెంగ్యూ
మన్యంలో డెంగ్యూ
Published Sat, Aug 13 2016 9:05 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ప్రభుత్వాస్పపత్రిలో డెంగ్యూ కేసు నమోదయ్యింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఒక గిరిజన బాలుడిని పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా నిర్దారించారు. ఆస్పత్రి వైద్యురాలు సుధ తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరం మండలం గిన్నేపల్లికి చెందిన కోండ్ల ప్రసాద్‌రెడ్డి అనే బాలుడు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు పోలవరం ఆస్పత్రిలో వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం బుట్టాయగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ రక్తపరీక్షలు చేయగా డెంగ్యూగా రిపోర్టు వచ్చింది. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం బాలుడి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ సుధ చెప్పారు.
డెంగ్యూ లక్షణాలతో వ్యక్తి మృతి ?
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన కొంకిమళ్ల భారతరావు (60) జ్వరంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతిచెందారు. ఈనెల 9న భారతరావుకు తీవ్ర జ్వరం రావడంతో బంధువులు జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమిచండంతో 12న విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్లేట్‌లేట్ కౌంట్ తగ్గిపోయామని వైద్యులు చెప్పారని మృతుడు భారతరావు కుమారుడు సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
Advertisement