హైదరాబాద్ : మలేషియాలో అనారోగ్యంతో చనిపోయిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వలస కార్మికుడి మృతదేహం బుధవారం శంషాబాద్‌కు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనుడు దేవ్‌సింగ్ జూన్ 10వ తేదీన ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. మాయమాటలు చెప్పి నగదు తీసుకుని మలేషియా పంపిన ఏజెంట్ రాజేందర్..అనంతరం అతడిని పట్టించుకోలేదు. దీంతో అక్కడికి వెళ్లిన దేవ్‌సింగ్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు.
స్థానికంగా అతడిని పట్టించుకునే వారు లేకపోవటంతో అక్కడే చనిపోయాడు. రాజేందర్ ఫీజు చెల్లించకపోవటంతో ఆస్పత్రిలోనే అతడి మృతదేహం ఉండిపోయింది. దీంతో రాజేందర్ కుటుంబసభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... మలేషియాలోని తెలంగాణ ఎన్నారై సంక్షేమ సంఘంతో మాట్లాడింది.
ఎన్నారై సంక్షేమ సంఘం వారు రంగంలోకి దిగి రాజేందర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా రాజేందర్ మృతదేహం బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అతడి మృతదేహన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు.