ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
సాక్షి మైత్రి మహిళ కోఆర్డినేటర్ శ్రీహరి
మధురానగర్ :
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా మరోనలుగురికి ఉపాధి కల్పించే విధంగా సాక్షి మైత్రి మహిళ పనిచేస్తుందని కార్యక్రమ కోఆర్డినేటర్ ఇ.శ్రీహరి తెలిపారు. స్థానిక మారుతీనగర్ కాకర్లవారి వీధిలో సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంతో నిర్వహించిన కుట్టుశిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వారిలో వృత్తినైపుణ్యాలు పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. తమ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుందన్నారు. సుశిక్షుతులైన సిబ్బంది చేత శిక్షణ ఇప్పించి అనంతరం సర్టిఫికెట్ అందజేస్తున్నామని తెలిపారు. రిసోర్స్‌పర్సన్ ప్రసాద్ మాట్లాడుతూ సాక్షి మైత్రి మహిళ ద్వారా మారుతున్న కాలనుగుణంగా మహిళలకు ఏది అవసరమో గుర్తించి ఆ రంగంలో శిక్షణ ఇవ్వటం అభినందనీయమన్నారు. అనంతరం కోర్సు పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు ‘సాక్షి’తో మాట్లాడారు..