నేడు ధనలక్ష్మిగా దుర్గమ్మ | dhanalaxmi alamkaram today | Sakshi
Sakshi News home page

నేడు ధనలక్ష్మిగా దుర్గమ్మ

Published Sat, Oct 29 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

నేడు ధనలక్ష్మిగా దుర్గమ్మ

నేడు ధనలక్ష్మిగా దుర్గమ్మ

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆదివారం ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు మహామండపం ఆరో అంతస్తులోని ఆర్జిత సేవల ప్రాంగణంలోని ఉత్సవమూర్తిని కూడా ధనలక్ష్మీదేవిగా అలంకరిస్తారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆదివారం ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు మహామండపం ఆరో అంతస్తులోని ఆర్జిత సేవల ప్రాంగణంలోని ఉత్సవమూర్తిని కూడా ధనలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. దీపావళిని పురస్కరించుకుని చేసే ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారికి ఉన్న అన్ని బంగారు ఆభరణాలు అలకరించాలని ఈవో సూర్యకుమారి నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement