- అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల భరోసా
రైతులు అధైర్య పడవద్దు
Published Tue, Sep 27 2016 1:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
ఖానాపురం : వర్షాల తో నష్టపోయిన రైతు లు అధైర్య పడవద్దని రాష్ట్ర వ్యవసాయ సహాయ సంచాలకులు రాజారత్నం, అజయ్‌కుమార్‌ఘోష్ అన్నా రు. ఖానాపురం మండలంలో వర్షాలతో నష్టపోయిన పంటలను సోమవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ఆదేశం మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో పంటలు పరిశీలించామని చెప్పారు. తాము సేకరించిన వివరాల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏఓ వసుధ, ఏఈఓ గాజుల శ్యాం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు, రైతులు బొప్పిడి పూర్ణచందర్‌రావు, మోహ¯ŒSరావు, కృష్ణారావు ఉన్నారు.
దుగ్గొండిలో..
వర్షాలతో నష్టపోయిన పలు పంటలను వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనరేట్ అధికారుల బృందం సోమవారం పరిశీలించింది. మందపల్లి, చాపలబండ, అడవిరంగాపురం, పిల్లిగుండ్లతండా, రాజ్యతండా గ్రామాల్లో పత్తి, వరి పంటలను కమిషనరేట్ అధికారులు అజయ్‌కుమార్‌ఘోష్, రాజారత్నం పరిశీలించారు. అనంతరం గిర్నిబావిలో విలేకరులతో మాట్లాడుతూ పత్తి రైతులకు అపార నష్టం వాటిల్లిందన్నారు. నీరు నిలవడంతో తెగుళ్లు వ్యాపించాయన్నారు. నష్టం తీవ్రం కాకుండా మండలానికి ఒక అగ్రి డాక్టర్‌తోపాటు వ్యవసాయ అధికారులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. గ్రామాలవారీగా వ్యవసాయ అధికారులు, వీఆర్‌ఓలతో ప్రత్యేక కమిటీ వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ దయాకర్ తదితరులు ఉన్నారు.
Advertisement