కలెక్టరమ్మా... న్యాయం చేయండి
Published Fri, Sep 16 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
హన్మకొండ అర్బన్ : పాలకుర్తిలో ఇరవై ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూమికి సంబంధించి పట్టాపాస్ బుక్కులు రద్దు చేయడంతో పాటు తమపై ఎర్రవెల్లి రంగారావు, వీరమనేని లక్ష్మణ్‌రావులే దాడిచేసి కొట్టారని కమలమ్మ వాపోయారు.
ఈ సందర్భంగా ఆమె గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కరుణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కమలమ్మ మాట్లాడుతూ రంగారావు, లక్ష్మణ్‌రావు దాడితో తన భర్త ముస్కు అంజయ్య క్రిమి సంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఇకనైనా తమ భూమికి సంబంధించి పాస్ బుక్కులు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కమలమ్మ కోరారు.
Advertisement
Advertisement