palakurthy
-
ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది.
-
నమ్మక ద్రోహి.. ఎర్రబెల్లి వల్లే జైలుకు వెళ్లాను: రేవంత్ రెడ్డి
సాక్షి, జనగామ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ పురస్కరించుకొని నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి ఎర్రబెల్లిపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ఈ రావుల పాలన పోవాలంటే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాలని రేంత్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో దొరల గడీలను పూడ్చివేద్దామన్నారు. పాలకుర్తి ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నారై ఝాన్సీ రెడ్డి అమెరికాలో డబ్బులు పోగుచేసి కృషి చేస్తుంటే.. ఇక్కడ సంపాదించిన వేలకోట్ల అక్రమ సంపాదనను మంత్రి దయాకర్ రావు అమెరికాలో పెట్టుబడులు పెడుతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల దయాకర్ రావు రాజకీయంలో అక్రమ సంపాదనలే తప్ప.. ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఎర్రబెల్లికి బుద్ధి చెప్పాలి: రేవంత్ ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పోవడానికి ఎర్రబెల్లినే కారణమని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలహీన పడటానికి కూడా దయాకర్ రావునే కారణమని అన్నారు. ఎర్రబెల్లి వెన్నుపోటు పొడిచే వ్యక్తి, నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, దయాకర్ రావు దొరల పాలనాలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజు అడిగిన పరిస్థితి లేదని విమర్శించారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం రూ. 360 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఎర్రబెల్లి దానిని రూ.7వందల కోట్లకు పెంచి, రూ.350 కోట్లు దోచుకున్న దొంగ అని ధ్వజమెత్తారు. ఓటు ద్వారా పాలకుర్తి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని కోరారు. రేవంత్ ఐటమ్ సాంగ్ లాంటోడు: ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కౌంటర్ ఇచ్చారు. పాలకుర్తి ప్రజలను రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ దగ్గరకు వచ్చిన వారిని రేవంత్ రెడ్డి కాళ్లతో తన్నాడని విమర్శించారు. పాలకుర్తి ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఐటమ్ సాంగ్ లాంటోడని, ఈ విషయం తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో చెప్పానని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా దీనిని అంగీకరించారన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు పేయింటర్గా పనిచేసేవాడని, బ్లాక్ మెయిల్ చేసి ఈ స్థాయికి వచ్చాడని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. పది కోట్ల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బయట రేవంత్ గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. దందాలు, బ్రోకరిజం బంద్ చేయాలని రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పానని తెలిపారు. దయన్న లెక్క నీతి నిజాయితీతో ఉంటే బతకలేమని అప్పుడు రేవంత్ రెడ్డి అన్న సంగతి గుర్తు చేశారు. తాము తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే రేవంత్ రెడ్డి చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పాలకుర్తి ప్రజలు నావెంటే ఉన్నారని స్పష్టం చేశారు. చదవండి: ఐటీ దాడులు.. పొంగులేటి అనుచరుడు ఆత్మహత్యాయత్నం -
కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు?
పాలకుర్తిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోందా? రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించే ప్రయత్నం జరుగుతోందా? కర్నాటక ఫలితాలతో నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గులాబీ గూటిలో గుబులు పుట్టించేలా పాలకుర్తిలో పావులు కదుపుతున్న నేతలు ఎవరు? మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులు ఎక్కడున్నారు? ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించేందకు రాజకీయాల్లో అపజయం ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం సాధించేవారు. ప్రజాభిమానం ఉన్నందునే ఎర్రబెల్లిని పార్టీలోకి ఆహ్వానించి కేబినెట్లో చోటు కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేసిఆర్ మాదిరిగానే ఓటమి ఎరగని నేతగా పేరున్న మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందని టాక్ నడుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయడానికి ఢోకా లేని మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. అమెరికాలో స్థిరపడ్డ పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. అమెరికాలో స్థిరపడ్డ రాజేందర్ రెడ్డి కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తుండగా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఝాన్సీరెడ్డి కొనసాగుతున్నారు. గత 30ఏళ్ళుగా స్వగ్రామంతోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతోపాటు స్వంత భూమి ఎకరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కెటాయించారు. చదవండి: జీవో 111 రద్దు.. 80 శాతం భూములు కేసీఆర్ బినామీ చేతుల్లోనే: రేవంత్‌రెడ్డి ఝాన్సీ రెడ్డి దంపతులను కలిసిన రేవంత్‌రెడ్డి తొర్రూరులో పాతికేళ్ళ క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. పుట్టిన గడ్డ మీద పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అమెరికా వెళ్ళిన టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపారట. వారి ఇంట్లోనే షెల్టర్ తీసుకున్న రేవంత్ రెడ్డి పార్టీలోకి అహ్వానించగా అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఇండియాకు రానున్న ఝాన్సీరాజేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతారని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ? ఈనెల 30న అమెరికాకు వెళ్ళనున్న రాహుల్ గాంధీతో సైతం ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు భేటి కానున్నారని సమాచారం. ఓటమి ఎరగని నేతగా రికార్డు సృష్టించిన మంత్రి ఎర్రబెల్లిని ఢీ కొట్టి కాంగ్రెస సత్తా చాటడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారట. ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులకు స్థానికత, సేవా కార్యక్రమాలు వర్క్ అవుట్ అవుతాయని భావిస్తున్నారు. ఎర్రబెల్లి సైతం సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవుతున్నప్పటికి ఆయన స్వగ్రామం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. దీంతో పాలకుర్తికి స్థానికేతరుడనే భావన కలుగుతుంది. ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎర్రబెల్లికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీరెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో ఈ మధ్యన ఎర్రబెల్లి మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాలతో గడుపుతున్నారు. ఝాన్సీరెడ్డి వచ్చినా మరెవ్వరు వచ్చినా ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఎవ్వరికి లేదని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎర్రబెల్లికి దీటైన వ్యక్తిని బరిలో దింపి రికార్డును తిరగరాస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఈడీ విచారణకు హాజరైన PSR గ్రానైట్స్ అధినేత పాలకుర్తి శ్రీధర్
-
ఆకుపట్టి.. కల్లు తాగిన మంత్రి.. టేస్ట్ సూపరుంది!
సాక్షి, పాలకుర్తి(జనగాం జిల్లా): రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. కుండతో కల్లు వంచుతుంటే.. మంత్రి ఆకుపట్టి కల్లు సేవించి సురాపానకం టేస్ట్ సూపరుందని గౌడ్‌ను అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి, అయ్యంగార్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. దారిలో తాటివనం వద్ద గౌడ్ కులస్తులను చూసి కారు ఆపి చెట్ల కిందకు చేరారు మంత్రి. ఈత చెట్టు కింద కూర్చొని నీరాకల్లు సేవించారు. ప్రకృతి సిద్ధమైన ఔషధం నీరా కల్లు అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ సంక్షేమానికి నీరాకల్లును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నీరా కల్లు ఇచ్చే ఈత చెట్లను అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొందరు చీడపురుగులు ఉంటారని, చేసింది చెప్పకుండా చేయంది ఏగేసి చెప్పడంతో ప్రజలు అదే నిజమని నమ్ముతారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడ్డాయని, రైతుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను ఎవరైనా విమర్శిస్తే రైతులే సరైన సమాధానం చెప్పాలని కోరారు. చదవండి: మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ? -
రైతు నిజాయితీ.. 15 గుంటలకు పట్టా పుస్తకం వచ్చినా కూడా తనకెందుకని..
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తూనే ఉన్నాం. కన్నవారిపైనే అమానుషానికి పాల్పడుతున్న వారసుల గురించి విన్నాం. కానీ, తనది కాని భూమి తనకెందుకని ఓ యువరైతు నిజాయితీ చాటుకున్నాడు. తన పేరుపై పొరపాటున నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా భూమిని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో వెలుగుచూసింది. పాలకుర్తి మండల పరిధి తిరుమలగిరి గ్రామంలో పొన్నం రాజు అనే రైతు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు బక్క సోమయ్యకు చెందిన 15 గుంటల పట్టా భూమి రికార్డుల్లో తప్పిదం కారణంగా పొన్నం రాజు పేరున నమోదైంది. అయితే, ఆ భూమి తనది కాదని సోమయ్యకు చెందినదని రాజు గుర్తించాడు. మండల తహసీల్దార్ పాల్‌సింగ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. స్వచ్ఛందంగా తహసీల్దార్ సమక్షంలో శనివారం సోమయ్యకు పట్టా చేయించి నిజాయితీ చాటుకున్నాడు. ఉప సర్పంచ్ నాగరాజుతో పాటు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు రాజును అభినందించారు. (చదవండి: బద్రినాథ్‌యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి) -
విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మ.. కొంగు నడుముకు చుట్టి..
చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. ఈ చరిత్రలో ఓభాగం జనగామ జిల్లా పాలకుర్తి మండంలోని విస్నూర్ గడి.శత్రు దుర్భేద్యమైన ఈ విస్నూర్ గడిలో నుంచే చుట్టూ 60 గ్రామాలకు విస్నూర్ దొరగా ప్రసిద్ధి చెందిన దేశ్‌ముఖ్ రాపాక వెంకటరాంచంద్రారెడ్డి పాలన సాగించాడు. ఆయన, ఆయన కుమారుడు బాబుదొర అనేక అరాచకాలు సృష్టించారు. వీరి పాలనపై కడివెండినుంచే తొలి తిరుగుబాటు మొదలైంది. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఈ కడివెండి గ్రామానికి చెందినవారే. ఈయనతో పాటు పిట్టల నర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహులు పల్లెపల్లెనా సంఘాలు ఏర్పాటు చేశాయి. దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని వీరిపై కసిపెంచుకుంది. దొరసాని ఆదేశంతో వారి అనుచరులు 1946 జులై 4న కాల్పులు జరపడంతో, దొడ్డి కొమురయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోదరుడు మల్లయ్యకు బుల్లెట్ గాయమైంది. రజాకార్లకు, విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడారు పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి తెలంగాణ సాయుధపోరాటంలో వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ ఓరకంగా ఉద్యమానికి ఊపిరులూదింది అని చెప్పవచ్చు. విస్నూర్ గడి దొర రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైద్రాబాద్ పారిపోతుండగా, జనగామ రైల్వేస్టేషన్లో కాల్చిచంపారు. ప్రజల ప్రతిఘటన 400గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. రజాకార్ల దాడులు, అరాచకాలు మరింతగా పెరిగాయి. తగ్గకుండా ప్రజా ప్రతిఘటన సాగింది. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. చివరకు నైజాం సర్కార్ 1948 సెప్టెంబర్ 17న కేంద్రంలో విలీనమైంది -
ఆర్ఎంపీతో వివాహం.. పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం..
పాలకుర్తి (జనగాం): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు శుక్రవారం వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండలం సీతరాంపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సురేశ్‌కు సరితతో 12 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సురేశ్ ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు అభిలాష్‌తో సరిత సన్నిహితంగా ఉంటోంది. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. వివాహేతర బంధాన్ని గుర్తించిన సురేశ్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అభిలాష్‌తో ఆమె చెప్పింది. రాత్రి సమయంలో ఇద్దరూ కలిసి సురేశ్‌ను హత్య చేశారు. అనంతరం నీళ్ల ట్యాంకులో పడేశారు. ఇదంతా కూతుళ్లు ప్రత్యక్షంగా చూశారు. కాగా మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. సురేశ్ హత్య కేసును సత్వరమే ఛేదించిన సీఐ వి.చేరాలు, ఎస్ఐ రమేశ్‌ను అభినందించి వారికి అవార్డు కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో సీఐ వి.చేరాలు, దేరుప్పుల ఎస్ఐ రమేశ్, పాలకుర్తి ఎస్ఐ శ్రీకాంత్ ఉన్నారు. చదవండి: (నీతో ఉండను నన్ను వెతకొద్దు.. వెతికితే చస్తా..!) -
వరంగల్ తూర్పులో టీఆర్ఎస్కు తప్పని తలనొప్పి.. పాలకుర్తిలో కొండా రెడీ?
ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం టిఆర్ఎస్ కోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతో గులాబీ గూటిలో ముసలం పుట్టి గ్రూప్ రాజకీయాలతో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అధికార పార్టీ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మూడున్నరేళ్ళలో మారిన పరిణామాల కారణంగా.. నన్నపనేని నరేందర్ కి పోటీగా బస్వరాజ్ సారయ్య, గుండు సుధారాణి రేస్‌లో వుండే అవకాశం లేకపోలేదు. ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రం అవుతుండడంతో టిఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల పార్టీని వీడటం మరో ఇబ్బంది. సురేఖకు అదే ప్లస్! కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతానికి కొండా సురేఖ ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసివచ్చే అంశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలయింది.వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, టిఆర్ఎస్ లో వర్గ పోరు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4 వేల ఓట్లకు పరిమితమైన బీజేపీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45 వేల ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే ఇది పూర్తిగా అర్బన్ ప్రాంతం కనుక బీజేపీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. రంగంలో కొండా? పాలకుర్తి నియోజకవర్గం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కంచుకోట. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గా దయాకర్ రావు ను దీవించడం నియోజకవర్గ ప్రజలకు పరిపాటిగా మారింది. విపక్ష అభ్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి జయకేతనం ఎగురవేస్తున్నారు. దయాకర్ రావును ఢీకొట్టే సరైన నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం ఆయనకు కలిసోస్తుందనే అభిప్రాయం వ్యక్త మవుతుంది. కానీ రాబోయే ఎన్నికల్లో మంత్రికి చుక్కలు చూపేందుకు రాజకీయ ప్రత్యర్ధి కొండా మురళి కాంగ్రెస్‌నుంచి బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు , యతిరాజారావు కుటుంబం నుండి ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎవరు పోటీ చేసినా బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. -
30 ఏళ్ల క్రితం ఫొటో ట్రెండ్‌ను గుర్తించి.. కెమెరా పట్టుకుంది.. ఇప్పుడు ఏకంగా..
అయ్యతోపాటు బువ్వను పండించే వేళ ఆమె ఓ మట్టి మనిషి.. వంటింటి కొలిమిలో పడి రుచిని వండే వేళ ఆమె ఓ మర మనిషి.. గిన్నెలు కడిగి, బట్టలుతికే వేళ జీతమెరుగని ‘పని’ మనిషి! చదువుల గంధమద్దుకొని అన్ని రంగాల్లో రాణించే వేళ ఆమె ఓ మహా మనిషి. ఇప్పుడెందరో మనమధ్య మహా మనుషులున్నారు. అంతా తామై.. ఆకాశంలో సగమై రాణిస్తున్నారు. రంగమేదైనా.. రాణించడమే ఆమె లక్ష్యం. విధులేవైనా.. విధేయతగా పూర్తి చేయడమే ఆమె ధ్యేయం. పట్టుదల, ఓర్పు ఆమెకు ప్రత్యేక అర్హతలు. అందుకే ఇప్పుడామె ధీమాగా.. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది.మంగళవారం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. భర్త చనిపోయిన బాధను దిగమింగుకుంది. అప్పటివరకు ఇంటిగడప దాటని ఆమె పొలం బాట పట్టింది. ఉన్న వ్యవసాయాన్ని చేసుకోవాలనుకుంది. మగవారు చేసే పనులన్నింటినీ నేర్చుకుంది. ఇప్పుడు సాగులో.. మేటిగా నిలిచింది పాలకుర్తి మండలం విస్నూరు గ్రామానికి చెందిన మహిళా రైతు బచ్చు శ్రీలత. 2005 భర్త శ్రీనివాసరావు విద్యుదాఘాతంతో చనిపోయాడు. కుటుంబ భారం తనపై పడింది. బయటికి వెళ్లి బతికే పరిస్థితి లేదు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ, తనకున్న నాలుగు ఎకరాల్లో వరితోపాటు ఆరుతడి పంటలు సాగు చేస్తోంది. వ్యవసాయానికి అవసరమైన వాటి కోసం బయటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండడంతో బైక్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు ద్విచక్రవాహనంపై మండల కేంద్రానికి వచ్చి అవసరమైనవి తీసుకెళ్తుంది. దుక్కి దున్నడం నుంచి గొర్రు తోలడం, నాట్లు వేస్తే...కలుపు తీయడం వరకు అన్ని పనులు చేస్తున్న శ్రీలత నేటి తరానికి ఆదర్శమే. – పాలకుర్తి ఫొటో ట్రెండ్.. నో ఎండ్! బిడపు కవితకు ఫొటోగ్రఫీ అంటే తెలియదు. ప్రతాప్‌ను వివాహమాడాక ఈ రంగంపై ఆసక్తి పెంచుకుంది. 30 ఏళ్ల క్రితం ఫొటో ట్రెండ్‌ను గుర్తించి కెమెరా పట్టుకుంది. విరామం లేకుండా పాస్‌ఫొటోల నుంచి వెడ్డింగ్షూట్, చిల్డ్రన్స్ షూట్, ఇలా ఏ కార్యక్రమమైనా క్లిక్‌మనిపిస్తోంది కవిత. తనలా మరెంతో మంది మహిళలను ఫొటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దాలని ఏడాదిన్నర క్రితం హనుమకొండలో సబిత ఫొటోగ్రఫీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది. – సాక్షి, వరంగల్ అడవిని అమ్మలా కాపాడుతూ.. భూపాలపల్లి అర్బన్: మారుమూల గ్రామమైన ఆజాంనగర్ రేంజ్ పరిధిలో నా డ్యూటీ. కొన్ని సందర్భాల్లో కలప స్మగ్లర్లు, పోడు రైతులు బెదిరిస్తారు. ఆర్నెళ్ల క్రితం పందిపంపుల శివారులో పోడు రైతులు నాపై, మా సిబ్బందిపై కిరోసిన్‌తో దాడి చేశారు. అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని అడవిని అమ్మలా కాపాడుకుంటున్నాం. మహిళగా ఈ ఉద్యోగంలో చేరినప్పటికీ సంతృప్తితో విధులు నిర్వహిస్తున్నా. – దివ్య, అటవీ రేంజ్ అధికారి, ఆజాంనగర్ టైలరింగ్.. ట్రైనింగ్! గూడూరు మండలం గుండెంగ శివారు అమృత తండాకు చెందిన బోడ వాణి టైలరింగ్‌లో రాణిస్తోంది. 2009లో వీరన్నతో వివాహం కాగా.. 2016లో ఆయన గుండెపోటుతో చనిపోయాడు. దీంతో ఇద్దరు పిల్లల బాధ్యత వాణి చూసుకోవాల్సి వచ్చింది. ఇంటర్లో కాలక్షేపానికి నేర్చుకున్న టైలరింగే ఆమెకిప్పుడు జీవనోపాధినిస్తోంది. పిల్లల్ని చదివిస్తోంది. తాను ఉపాధి పొందుతూ మరికొందరు మహిళలకు టైలరింగ్‌లో శిక్షణనిస్తోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిత్యం శ్రమిస్తోంది వాణి. చెప్పులు కుట్టి.. కొడుకును చదివించి! స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రానికి చెందిన దేవరకొండ అరుణ భర్త పన్నెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్నుంచి కుటుంబ భారాన్ని ఆమె భుజాలపై మోస్తొంది. చెప్పులు కుడుతూ కొడుకును ఉన్నత చదువులు చదివించింది. కుమారుడు నరేశ్ సైతం తల్లి కష్టాన్ని గుర్తించి.. బాగా చదివి బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం మంచి ప్యాకేజీతో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులవృత్తిని నమ్ముకొని బిడ్డను ప్రయోజకున్ని చేసిన ఆ తల్లి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. -
Putta Madhu: అదే జరిగితే పెద్దపల్లి జెడ్పీ కుర్చీ ఎవరికో..?!
మంథని: న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాత్రపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ పీఠంపై పలువురు కన్ను పడింది. మొదటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా తామంటే తాము అవుతామని ఊహల లోకంలో తేలినవారికి స్వయానా సీఎం కేసీఆర్ పుట్ట మధు పేరు ప్రస్తావించడంతో మిన్నకుండిపోయారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మధు పోలీసుల అదుపులో ఉండడంతో ఆయన పదవికి గండం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రస్తుతం పుట్ట మధును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే మధు చైర్మన్ పదవి ఊడుతుందని, ఆ స్థానంలో తాము సిద్ధంగా ఉన్నామని పలువురు జెడ్పీటీసీలు అధిష్టానం ఎదుట బారులు తీరినట్లు సమాచారం. వీరిలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మొదటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతుతో జెడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు జిల్లాలోని మరో ముగ్గురు జెడ్పీటీసీలు సైతం చైర్మన్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. పుట్ట మధును పోలీసులు విచారిస్తున్నా.. ఇప్పటివరకు ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయినా మధు పదవి ఎలాగైనా పోతుందనే ముందస్తు సమాచారంతో జెడ్పీటీసీలు చైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..! -
పెద్దలు ఒప్పుకోరని.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, పాలకుర్తి టౌన్: ఇద్దరిదీ తెలిసీతెలియని వయస్సు. కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఆకర్షణకు లోనయ్యారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలోని ఎర్రమల్లయ్యకుంట పరిసరాల్లో శనివారం జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన శేర్ల ఎల్లమ్మ– సమ్మయ్య దంపతులు, వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన శిరిసాల హుస్సేనమ్మ– సైదులు దంపతులు పాలకుర్తికి వలస వచ్చి ఎర్రమల్లయ్యకుంట పరిసరాల్లో ఒకే దగ్గర నివాసముంటున్నాయి. చదవండి: ప్రమాదం ఒకరిది.. ప్రాణాలు ఇతరులవి.. ఈ క్రమంలో ఎల్లమ్మ– సమ్మయ్యల కుమారుడు అంజి (17), హుస్సేనమ్మ– సైదులు కుమార్తె లక్ష్మి (16) మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అయితే, పెద్దలు తమకు వివాహం చేయరని భావించి శుక్రవారం రాత్రి ఊరిబయట పురుగుల మందు తాగారు. అనంతరం తమ ఇళ్లకు వెళ్లాక అపస్మారకస్థితికి చేరుకున్నారు. వారి తల్లిదండ్రులు గమనించి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. చదవండి: మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను -
మంత్రి వర్గంలో ‘ఎర్రబెల్లి’కి చోటు
రాష్ట్ర కేబినెట్లో జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం రావడంతో మంత్రి వర్గంలో చోటుదక్కుతుందని భావించిన ఆశావహులకు నిరాశే ఎదురైంది. ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాలు ఉండగా పది స్థానాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్‌తోపాటు రెండు మంత్రి పదవులు జిల్లాను వరించాయి. ఈ సారి ఒక్క పదవి మాత్రమే దక్కడంతో మిగతా వారికి కార్పొరేషన్ల చైర్మన్, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. అమాత్య పదవులు ఎవరిని వరించబోతున్నాయన్న ఊహగానాలకు ఎట్టకేలకు తెరపడింది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయమై పూర్తి స్థాయి కసరత్తు అనంతరం జాబితాను సిద్ధం చేశారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాలకుర్తి శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చోటు లభించినట్లు సీఎం కార్యాలయం నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. నేడు ప్రమాణ స్వీకారం ఈనెల 19న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ ఈ విషయమై గవర్నర్ నరసింహన్‌కు తెలియజేశారు. ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్లో మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టనుండడంతో ఇప్పటి వరకు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆశావహులు పదవి దక్కించుకోవడానికి, అందులోనూ అనుకున్న శాఖ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత కేబినెట్లో స్పీకర్, రెండు మంత్రి పదవులు.. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో జిల్లాకు స్పీకర్, రెండు మంత్రి పదవులు దక్కాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకా శం దక్కింది. తర్వాత డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పదవి కోల్పోవడంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా రెండో సారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మం త్రి వర్గ విస్తరణ చేయలేదు. ప్రస్తుతం ముహూర్తం ఖరారు కావడంతో ఉత్కంఠకు తెరపడింది. మంత్రిగా ‘ఎర్రబెల్లి’కి అవకాశం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాల ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందింది. తొలి సారిగా మం త్రి వర్గంలో దయాకర్‌రావుకు చోటు దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 10 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అందులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట అరూరి రమేష్, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ శంకర్‌నాయక్, డోర్నకల్ రెడ్యానాయక్, నర్సంపేట పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల చల్లా ధర్మారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ డాక్టర్ రాజయ్య, జనగామ యాదగిరిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ధరంసోత్ రెడ్యానాయక్, వినయ్‌భాస్కర్, అరూరి రమేష్‌లకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లి దయాకర్‌రావుకే మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఆ తరువాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలతోపాటు 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా వరుసగా ఆరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత టీడీఎల్పీ నేతగా వ్యహరించారు. 2016లో టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 53,062 ఓట్ల భారీ మెజార్టీ విజయం సాధించారు. హైదరాబాద్‌లోనే దయాకర్‌రావు మంత్రివర్గ విస్తరణ మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్లుకు తన సాయంగా రూ.2.50లక్షల చెక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం అందించారు. ఇదే సందర్భంలో కేటీఆర్ ఎర్రబెల్లికి ముందస్తు అభినందలు తెలిపినట్లు సమాచారం. ఇది జరిగిన కొన్ని నిమిషాల తేడాతోనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావడంతో ఆయన రాజధానిలోనే ఉన్నారు. మండలి చైర్మన్‌గా కడియం? గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరికి శాసన మండలి చైర్మన్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎమ్మెల్సీ పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఆ స్థానం కడియంకు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రబెల్లి దయాకర్‌రావు బయోడేటా.. పూర్తి పేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు తండ్రి : ఎర్రబెల్లి జగన్నా«థరావు తల్లి : ఎర్రబెల్లి ఆదిలక్ష్మి భార్య : ఉషాదయాకర్‌రావు కుమారులు: ఎర్రబెల్లి ప్రేమ్ చందర్రావు స్వగ్రామం: గ్రామం, మండలం, పర్వతగిరి, జిల్లా వరంగల్ రూరల్ పుట్టిన తేది: 04–07–1956 విద్యార్హతలు: ఇంటర్మీడియట్ రాజకీయరంగ ప్రవేశం : 1982, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రథమ కన్వీనర్‌గా నియామకం, 1994లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నిక,1997లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక, 1999లో ప్రభుత్వ విప్‌గా ఎన్నిక,2008లో ఎంపీగా గెలుపు. 2009, 2014, 2018లో పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక. -
జనగామలో కుతుబ్‌షాహీల శాసనం
సాక్షి, హైదరాబాద్: తెలుగు నేలను పాలించిన మహ్మదీయ రాజుల్లో ప్రముఖులైన కుతుబ్‌షాహీల కాలానికి చెందిన అరుదైన శాసనం వెలుగు చూసింది. రెండువందల ఏళ్లు కుతుబ్‌షాహీలు గోల్కొండ కేంద్రంగా పాలన సాగించగా వీరి శాసనాలు ఇప్పటివరకు వందలోపు లభ్యమయ్యాయి. ఇందులో ఒకటి నాగర్‌కర్నూల్ జిల్లాలో బయటపడగా, మరొకటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో చరిత్రకారులు కనుగొన్నారు. వల్మిడి గ్రామ చెరువుకట్ట సమీపంలో ఈ శాసనాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్, అరవింద్ ఆర్యా, చంటి, ముడావత్ రవీందర్, కమలాకర్ నాయక్‌లు కనుగొన్నారు. ఈ శాసనం శాలివాహన శకం సం.1489, ప్రభవ నామ సం.శ్రావణ శుద్ధ 12(ద్వాదశి) శుక్రవారం అంటే క్రీ.శ.1567 జూలై 18న వేశారు. ఈ శాసనం ఇబ్రహీం కుతుబ్‌షా, కులీకుతుబ్‌షా తండ్రి పాలనాకాలంనాటిది. ఇది తెలుగులో ఉంది. తొలుత రామకథను కీర్తించే ఒక సంస్కృత శ్లోకంతో మొదలైంది. ‘ఈ లోకంలో సూర్యచంద్రులు, భూమి, రామకథ ఉన్నంతదాకా రాజ్యం ఉంటుంది విభీషణా’అని అర్థమిచ్చే ఈ శ్లోకం కుతుబ్‌షాహీ రాజ్యానికి అన్వయిస్తూ శాసన రచయిత రాసినట్లుంది. అస్పష్టమైన పేరు (మీరా తాజనమియ్య)గల పాలకుడు తవ్వించిన ‘వలిమిడి ’చెరువు కింద ఒకటో పొలచంరాజు మర్తురు భూమిని పంట పండించుకుని ఫలం ఆచంద్రార్కంగా అనుభవించమని (ఎవరికి అన్నది శాసనంలో పేర్కొనలేదు) ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ శాసనాన్ని బట్టి ఆ కాలంలో జనగామ ప్రాంతాన్ని ఒకటో పొలచంరాజు పాలించాడనే విషయాన్ని బలపరిచేలా ఇక్కడికి సమీపంలో పాలంరాయుని పేట అనే పాటిగడ్డ (పాతవూరిగడ్డ) ఉంది. అక్కడ రాజభవనం నిర్మాణ శిథిలాలు అగుపిస్తున్నాయి. అక్కడ పూర్వం రాజెవరో ఉండేవారని ప్రజలు చెప్పుకుంటారు. ఆ రాజే పాలంరాయుడు కావచ్చు. వల్మిడి శాసనం విశేషాలు: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం శాసన స్థానం: తాళ్ల చెరువు కట్ట కింద లిపి: తెలుగు , భాష: తెలుగు శాసనోద్దేశం: చెరువు కట్టడం, భూదానం శాసన సమయం: శక సంవత్సరం 1489, ప్రభవ నామ సం.శ్రావణ శు.12, 1567 జూలై 18 శుక్రవారం శాసన రాజవంశం: కుతుబ్‌షాహీలు శాసనకాలపు రాజు: ఇబ్రహీం కుతుబ్‌షా శాసనం వేయించింది: పొలచం రాజు -
కల.. నెరవేరే వేళ..
పాలకుర్తి: సాగునీటి కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాతల కల త్వరలో నెరవేరబోతోంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను ముందుకు కదిలించారు. నిత్యం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో విడతలో భాగంగా 2009 సంవత్సరంలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన పాలకుర్తి ప్రాజెక్టు పనులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయించాలనే లక్ష్యంతో ముందుకుసాగారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని విజప్తి చేశారు. రిజర్వాయర్‌కు రూ. 11 కోట్లు మంజూరు.. పాలకుర్తి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సుమారు 700 ఎకరాల భూమిని సేకరించారు. గతంలో 250 ఎకరాలు ఉన్న పాలకుర్తి ఊరచెరువు కొత్తగా సేకరించిన 700 ఎకరాలతో 950 ఎకరాల విస్తీర్ణానికి చేరింది. కాగా, 2009లో శంకుస్థాపన జరిగిన పనులు ఎట్టకేలకు ఈనెల 15న ప్రారంభమయ్యాయి. 0.25 టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు పనులను క్రాంతి కన్స్ట్రక్షన్స్ అధినేత సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడు నెలల్లో రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేసి పాలకుర్తి మండలంలోని తీగారం, లక్ష్మీనారాయణపురం, విస్నూరు, వల్మిడి, ముత్తారం, మంచుప్పుల శిరసన్నగూడెం తదితర గ్రామాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
కలెక్టరమ్మా... న్యాయం చేయండి
హన్మకొండ అర్బన్ : పాలకుర్తిలో ఇరవై ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూమికి సంబంధించి పట్టాపాస్ బుక్కులు రద్దు చేయడంతో పాటు తమపై ఎర్రవెల్లి రంగారావు, వీరమనేని లక్ష్మణ్రావులే దాడిచేసి కొట్టారని కమలమ్మ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కరుణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కమలమ్మ మాట్లాడుతూ రంగారావు, లక్ష్మణ్‌రావు దాడితో తన భర్త ముస్కు అంజయ్య క్రిమి సంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఇకనైనా తమ భూమికి సంబంధించి పాస్ బుక్కులు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కమలమ్మ కోరారు.