
సాక్షి, పాలకుర్తి టౌన్: ఇద్దరిదీ తెలిసీతెలియని వయస్సు. కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఆకర్షణకు లోనయ్యారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలోని ఎర్రమల్లయ్యకుంట పరిసరాల్లో శనివారం జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన శేర్ల ఎల్లమ్మ– సమ్మయ్య దంపతులు, వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన శిరిసాల హుస్సేనమ్మ– సైదులు దంపతులు పాలకుర్తికి వలస వచ్చి ఎర్రమల్లయ్యకుంట పరిసరాల్లో ఒకే దగ్గర నివాసముంటున్నాయి. చదవండి: ప్రమాదం ఒకరిది.. ప్రాణాలు ఇతరులవి..
ఈ క్రమంలో ఎల్లమ్మ– సమ్మయ్యల కుమారుడు అంజి (17), హుస్సేనమ్మ– సైదులు కుమార్తె లక్ష్మి (16) మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అయితే, పెద్దలు తమకు వివాహం చేయరని భావించి శుక్రవారం రాత్రి ఊరిబయట పురుగుల మందు తాగారు. అనంతరం తమ ఇళ్లకు వెళ్లాక అపస్మారకస్థితికి చేరుకున్నారు. వారి తల్లిదండ్రులు గమనించి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. చదవండి: మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను