Minor lovers
-
Hyderabad: విషాదంగా మారిన మైనర్ ప్రేమ జంట వివాహం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మైనర్ ఫేస్బుక్ ప్రేమ జంట వివాహం విషాదంతో ముగిసింది. వివరాలు.. ఇద్దరు మైనర్లకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మైనర్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. దీంతో మనస్తాపం చెందిన మైనర్ బాలిక ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకుంది. బాలిక మరణం విషయం తెలుసుకున్న బాలుడు బుధవారం మౌలాలి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ట్విస్టులే ట్విస్టులు.. కిడ్నాపర్‌ను పట్టించిన స్టిక్కర్.. ఆపరేషన్ ‘నిమ్రా’ సక్సెస్ -
విడిచి ఉండలేక.. విడివిడిగా ఆత్మహత్య!
సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): వారిద్దరిదీ తెలిసీతెలియని వయసు. అయినా ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆ అమ్మాయి, అబ్బాయిల కులాలు వేర్వేరు. పెద్దలు వారించడంతో కలసి ఉండలేమని భావించి ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన సురువ్ రామస్వామి, శ్రీలత దంపతుల కుమారుడు శివ(18) తొమ్మిదో తరగతి, అదే గ్రామానికి చెందిన సిరిపురం కుమార్, పద్మ దంపతుల కూతురు సుస్మిత(17) పదోతరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. కొద్దిరోజులుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిని మందలించారు. పెళ్లిచేసుకునే వయస్సు కాదంటూ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా ఆ ప్రేమజంటలో మార్పు రాలేదు. ఆర్నెళ్ల క్రితం ఇద్దరూ కలసి హుజూరాబాద్‌లోని శివ అమ్మమ్మ ఇంటికి పారిపోయారు. శివ మేనమామ వారిద్దరినీ మందలించి సుస్మిత బంధువులకు సమాచారం ఇచ్చారు. హుజూరాబాద్ పోలీసుల సమక్షం నుంచి సుస్మితను ఆమె తల్లిదండ్రులు తమ గ్రామానికి తీసుకెళ్లారు. చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మూడ్రోజులపాటు అప్పటి నుంచి శివ హుజూరాబాద్‌లోనే ఉంటూ సుస్మితతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 12న శివ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వరంగల్‌కు, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అతడి మృతదేహానికి అదేరోజు సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. అనంతరం సుస్మిత సోమవారంరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. మంగళవారం వేకువజామున సమీప వ్యవసాయబావిలో శవమై తేలింది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మైనర్ ప్రేమ వ్యవహారం.. ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకుంటే..
సాక్షి, శ్రీకాకుళం: తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకపోతే సెల్‌టవర్ నుంచి దూకేస్తానంటూ పదో తరగతి విద్యార్థి హల్చల్ సృష్టించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కథ సుఖాంతమైంది. వీరఘట్టం గాసీ వీధికి చెందిన 16 ఏళ్ల బాలుడు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో వీరఘట్టం నుంచి విశాఖపట్నం వెళ్లే కాయగూరల వాహనాలకు క్లీనర్‌గా వెళ్తుండేవాడు. ఈ క్రమంలో విశాఖలో 19 ఏళ్ల అమ్మాయితో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ వారం రోజుల కిందట ఆ అమ్మాయిని వీరఘట్టం తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు గురువారం వీరఘట్టం వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో విశాఖ వెళ్లిపోయింది. చదవండి: భర్తతో విసిగిపోయిన భార్య .. సుపారీ ఇచ్చి.. పక్కా ప్లాన్‌తో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అబ్బాయి సాయంత్రం 5 గంటల సమయంలో వీరఘట్టంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అమ్మాయిని తీసుకురాకపోతే టవర్ పైనుంచి దూకేస్తానని చెప్పడంతో స్థానికు లు వీరఘట్టం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పాలకొండ ఫైర్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని అబ్బాయితో చాకచక్యంగా మాట్లాడి రాత్రి 8 గంటల సమయంలో టవర్ పైనుంచి కిందకు దించా రు. దీంతో మూడు గంటల ఉత్కంఠకు తెరపడింది. -
యువతితో మూడేళ్లపాటు ప్రేమ.. వివాహం అనగానే..
సాక్షి, సుల్తానాబాద్‌రూరల్(కరీంనగర్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోకుండా తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట బుధవారం ఓ యువతి బైఠాయించిన సంఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన చొప్పరి సంజీవ్,అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి పట్టించుకోకపోవడంతో అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఇద్దరి కులాలు ఒక్కటికావడంతోపాటు మైనర్లు కాగా గతంలో ఇరు కుటుంబాలకు తెలిసింది. 2018లో ఇరువురి కుటుంబాలు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కాగా స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో దండలు మార్చుకున్నారు. ప్రియుడి అన్నకు పెళ్లికాకపోవడంతో ప్రేమికులిద్దరు ఎవరి ఇంట్లో వారే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్ర స్తుతం ప్రియుడి అన్నకు పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి చేసుకోవాలని కోరగా తప్పించుకు తిరుగుతున్నాడని వాపోయింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని కౌన్సెలింగ్ నిమిత్తం రాణాకు తరలించారు. -
పెద్దలు ఒప్పుకోరని.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, పాలకుర్తి టౌన్: ఇద్దరిదీ తెలిసీతెలియని వయస్సు. కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఆకర్షణకు లోనయ్యారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలోని ఎర్రమల్లయ్యకుంట పరిసరాల్లో శనివారం జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన శేర్ల ఎల్లమ్మ– సమ్మయ్య దంపతులు, వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన శిరిసాల హుస్సేనమ్మ– సైదులు దంపతులు పాలకుర్తికి వలస వచ్చి ఎర్రమల్లయ్యకుంట పరిసరాల్లో ఒకే దగ్గర నివాసముంటున్నాయి. చదవండి: ప్రమాదం ఒకరిది.. ప్రాణాలు ఇతరులవి.. ఈ క్రమంలో ఎల్లమ్మ– సమ్మయ్యల కుమారుడు అంజి (17), హుస్సేనమ్మ– సైదులు కుమార్తె లక్ష్మి (16) మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అయితే, పెద్దలు తమకు వివాహం చేయరని భావించి శుక్రవారం రాత్రి ఊరిబయట పురుగుల మందు తాగారు. అనంతరం తమ ఇళ్లకు వెళ్లాక అపస్మారకస్థితికి చేరుకున్నారు. వారి తల్లిదండ్రులు గమనించి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. చదవండి: మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను -
ఎందుకీ అఘాయిత్యం?
మైనర్ ప్రేమికుల ఆత్మహత్యాయత్నం అబ్బాయి మృతి, చావుబతుకుల్లో బాలిక రావికమతం: అంతుబట్టని కారణంతో మైనారిటీ తీరని బాలుడు, బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో బాలుడు మృతి చెందగా, బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది. పి.పొన్నవోలు శివారు పెదకుముందానిపేట గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ ప్రేమికులు బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ప్రియుడు మృతిచెందగా, బాలిక విశాఖలోని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పెద్దలకు కనీసం తెలియని ఈ ప్రేమ వ్యవహారంపై ఎవ్వరేమన్నారో తెలియదుగానీ తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకుని వీరు కన్నవారికి కన్నీరు మిగిల్చారు. ఇంతకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. గ్రామానికి చెందిన నరేంద్ర (17), సమీపంలోనే నివాసం ఉంటున్న కల్పన(14) కొంతకాలంగా ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కల్పన మేడివాడ హైస్కూల్లో ఏడో తరగతి పూర్తి చేసింది. నరేంద్ర గతంలో ఎనిమిది వరకూ చదివి ఖాళీగా ఉంటున్నాడు. బధవారం రాత్రి వీరిరువురూ కొత్తకోటలోని కల్పన తాతగారింటికి వచ్చారు. వారు ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడికి సమీపంలోని హైస్కూల్ గ్రౌండ్‌కు వెళ్లారు. అప్పటికే కొని సిద్ధంగా ఉంచుకున్న గుళికలు మింగేశారు. కాసేపటికి గింజుకుంటూ వారి బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉభయుల బంధువులూ అక్కడికి చేరుకుని వెంటనే నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా నరేంద్ర మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కల్పన అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సచేసి ఆపై విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతోంది. తహశీల్దార్ భాస్కరరావు ఆ గ్రామం వెళ్లి విచారించారు. వారిద్దరూ ఎపుడూ కలిసి ఉన్నట్లు కూడా చూడలేదని, ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని అక్కడివారు తహశీల్దార్‌కు వివరించారు. కొత్తకోట ఎస్ఐ శిరీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.