పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలి
మెదక్(మఠంపల్లి): మెదక్‌జిల్లా కుక్కునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య విషయంలో గజ్వేల్‌డీఎస్పీ, సీఐలపై 306 కేసు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో నిర్వహించిన ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సంతాప సభలో మాట్లాడారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో అధికారుల ఒత్తిడితో పోలీస్‌అధికారి ఆత్మహత్యకు పాల్పడితే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే ఆత్మహత్యకు గల కారణాలను పరిశోధించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల అమర్‌నాథరెడ్డి, తన్నీరు మల్లికార్జున్ రావు, లక్ష్మీనారాయణరెడ్డి, సీతారాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.