
‘సదరం’గం
అసలే దివ్యాంగులు. జిల్లా నలుమూలల నుంచి అష్టకష్టాలు పడి సర్వజనాసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సదరం శిబిరం అస్తవ్యస్తంగా మారడంతో వీరికి చుక్కలు కనిపించాయి. వైకల్య ధ్రువీకరణ దరఖాస్తులు తీసుకునేందుకు.. పరీక్షలు చేయించుకునేందుకు ఎదుర్కొన్న అవస్థలు వర్ణనాతీతం. ఇలా మధ్యాహ్నం దాటిపోవడంతో వైద్యులు ఇంటిముఖం పట్టారు. దిక్కుతోచని దివ్యాంగులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో శాంతించారు. ఇకపై ఎలాంటి సమస్య తలెత్తకుండా శిబరం నిర్వహిస్తామనడంతో వెనుదిరిగారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం