అన్నదాన పథకానికి రూ.2,00,117 విరాళం | donation with food scheme | Sakshi
Sakshi News home page

అన్నదాన పథకానికి రూ.2,00,117 విరాళం

Published Thu, Sep 8 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

donation with food scheme

అన్నవరం :
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు గురువారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. కాకినాడ రూరల్‌ తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి అక్కన్న, నాగరత్నం దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఏసీ ఈరంకి జగన్నాథరావుకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా అక్టోబర్‌ 19న తమ పేరిట అన్నదానం చేయాలని వారు కోరారు. అలాగే, బెంగళూరుకు చెందిన సరస్వతుల జానకి రూ.1,00,001 విరాళాన్ని అన్నదానం ఏఈఓ పి.నటరాజారావుకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా చైత్ర బహుళ తదియనాడు సరస్వతుల సుబ్బయ్యశాస్త్రి పేరిట అన్నదానం చేయాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement