ప్రకటన వచ్చిందని సైలెంట్‌గా ఉండొద్దు | Dont be Scilent | Sakshi
Sakshi News home page

ప్రకటన వచ్చిందని సైలెంట్‌గా ఉండొద్దు

Published Sat, Aug 27 2016 10:29 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

మాట్లాడుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి

– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి
వనపర్తిటౌన్‌ : ప్రశాంత రాజకీయ వాతావరణం, రాష్ట్ర రాజకీయాలను ఆకర్షించే శక్తి సురవరం ప్రతాప్‌రెడ్డి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిననాటి నుంచి ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక  టీడీపీ అధ్యక్షుడు నందిమల్ల అశోక్‌ నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తి జిల్లా నిలుపుదల కోసం రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందని, సైలెంట్‌గా ఉంటే వ్యతిరేకులు బలపడే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీలు ఎవరిపాత్రను వారు పోషించారని రావుల పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా వచ్చిన జిల్లా ప్రకటన నిలుపుకునేందుకు గ్రామస్థాయి నుంచి వనపర్తి ఆవశ్యకతను చాటిచెప్పేందుకు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌కు ఈమెయిల్‌ ద్వారా విజ్ఞాపనలు అందజేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి గ్రామస్థాయి నుంచి వనపర్తి జిల్లా ప్రత్యేకతను చాటుతూ వినతిపత్రాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి. రాములు, తిరుమలయ్య, ఉంVగ్లం తిరుమల్, నందిమల్ల రమేష్, ఖాద్, నందిమల్ల శారద తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement