Wanparthy
-
గూడుసంగతేంటి?
అసలే ఎండాకాలం! ఎప్పుడు.. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవరూ చెప్పలేం.. ఎక్కడైనా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే ఆ వాహనం వస్తే తప్ప మంటలను అదుపు చేయలేని పరిస్థితి.. కానీ అలాంటి వాహనానికే రక్షణ కరువైంది.. కనీసం చిన్నపాటి షెడ్డు కూడా లేకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పుపట్టిపోతుంది.. ఇక ఆ వాహనానికి సంబంధించిన అధికారులు పనిచేసేందుకు కూడా ఒక సొంత గూడు కరువైపోయింది.. తాత్కాలికంగా ఓ అద్దె భవనంలో కాలం నెట్టుకొస్తున్నారు.. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వాహనం.. అధికారులు ఎవరో.. అదేనండి అగ్నిమాపక (ఫైరింజన్) శాఖ కార్యాలయం.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని దుస్థితి ఇది.. మహబూబ్‌నగర్ క్రైం : అగ్నిప్రమాదం బారిన పడిన ఇళ్లను, కార్యాలయాలను, పంటలను ఇ లా ఎలాంటి వాటినైనా రక్షించే బాధ్యత అగ్ని మాపక శాఖది. కానీ వాళ్లు ఉండటానికి రక్షణతో కూడిన వసతి లేకుండాపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి పునాది రాయి వేసి ఏళ్లు గ డుస్తున్నా నిర్మాణం ఇంకా పూర్తికావడం లేదు. సొంత భవనాలు లేక పట్టణ ఇందిరక్రాంతి పథకం, స్వయం సహాయ మహిళా సంఘాల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన భవనంలో తలదాచుకుంటున్నారు. ఇక మ హిళా సంఘాల సభ్యులకు ఎప్పుడైనా శిక్షణ, సమావే శం ఉంటే ఆ రోజంతా ఆరుబయట పడిగాపు లు కాయాల్సిందే. అధికారుల పరిస్థితే ఇలా ఉంటే.. అగ్నిమాపక శాఖకు చెందిన ఫైరింజన్లు నిలపడానికి ఎలాంటి షెడ్డు లేకపోవడంతో ఆరుబయట ఎండలో ఓ మూలకు ఆపారు. అద్దె భవనాలే దిక్కు.. జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయంతోపాటు అగ్నిమాపక స్టేషన్ అధికారి కార్యాలయం రెండు అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. శాశ్వత భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి కాకపోవడంతోపాటు ఆ దిశగా ప్రయత్నాలు జరిపే నా థుడే కరువయ్యారు. 2015 సంవత్సరంలో మ ంజూరైన భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుంటే పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. పాత భవనం కూల్చిన తర్వాత అగ్నిమాపక శాఖ కార్యాలయం సొంత భవనం లేకపో వడం తో ఈ శాఖ సమస్యలను ఎదుర్కొంటుంది. వెనక్కి వెళ్తున్న నిధులు.. పట్టణంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.74 కోట్ల నిధులను కేటాయించినా వీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. శాశ్వత భవనం లేకపోవడంతో నెలకు రూ.10 వేల వరకు అద్దె చెల్లిస్తూ డీఎఫ్ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ నూతన కార్యాలయ నిర్మాణానికి 2015 జూన్‌లో పునాది వేశారు. రెండు అంతస్థుల భవనం నిర్మాణం కోసం రూ.1.74 కోట్లను కేటాయించారు. దీని నిర్మాణ పనులను రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు చూసు కుంటుండగా.. నిర్మాణ పనులు మాత్రం ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే సకాలంలో నూతన భవన నిర్మాణ పనులు పూర్తికాక వచ్చిన నిధులు వెనక్కి వెళ్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయాలు నూతన భవన నిర్మాణాలను రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు వాళ్లు చూసుకుంటు న్నారు. గత మూడేళ్ల నుంచి కొత్త భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం డీఎఫ్ఓ, ఫైర్ ఆఫీసర్ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడిపిస్తున్నాం. పనులు పూర్తి చేయాలనే అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. – శ్రీనివాసులు, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, మహబూబ్‌నగర్ -
సైకిల్ దొరికింది.. స్వాతి మురిసింది!
పాన్‌గల్ మండలం మల్లాయపల్లికి చెందిన 11ఏళ్ల స్వాతి పుట్టుకతోనే దివ్యాంగురాలు. అమ్మానాన్నలు నిరుపేద కూలీలు.. తల్లి తోడు లేనిదే బయటికి రాలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మ చంకనెక్కాల్సిందే..! బిడ్డకు ట్రైసైకిల్ మంజూరు చేయాలని ఆమె తల్లి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో చంద్రయ్యకు విన్నవించింది. ఆయన ఆదేశాల మేరకు డీడబ్ల్యూఓ వరప్రసాద్ ఆమెకు అరగంటలోనే ట్రై సైకిల్‌ను సమకూర్చారు. జేసీ నిరంజన్, డీఆర్వో చంద్రయ్య తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా స్వాతికి మోములో చిరునవ్వు వెల్లివిరిసింది. – ఎం.యాదిరెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, వనపర్తి -
‘దళితులను దగాచేస్తున్న ప్రభుత్వం’
గోపాల్పేట : దళితులను దగా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ మాల మాహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. నాలుగేళ్లలో దాదాపు రూ.95వేల కోట్లను సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు నలుగురితో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నారు. అంబేద్కర్ సుజల స్రవంతి పేరును కాళేశ్వరంగా మార్చి అంబ్కేదర్‌ను అవమానించారన్నారు. తెలంగాణ కోసం పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం పర్యటిస్తే జైల్లో పెడతారు.. అదే కేసీఆర్‌ను తిట్టిన పవన్ కల్యాణ్ మాత్రం పర్యటించ వచ్చా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించడమే తప్ప ఖర్చు చేయడం లేదన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. త్వరలో నడిగడ్డలో దళితగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తుమ్మల రవికుమార్, శ్రీనివాస్, కృష్ణ, రవికుమార్ ఉన్నారు. -
మురుగు.. ముప్పు
వీపనగండ్ల : మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. వీధుల్లోని రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. పందులు, దోమలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముక్కు మూసుకోవాల్సిందే.. గ్రామాల్లోని అంతర్గత రోడ్లపై నడవాలంటే ముక్కు మూసుకెళ్లాల్సిందే. రోడ్లపైనే మురుగు, వ్యర్థపదార్థాలు పడేస్తుండటంతో పందులు సంచరిస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు .. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా చేసుకున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా మండలంలో పారిశుద్ధ్యం, అంతర్గత , ఆపరేటర్ల నిర్వాహణ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేశారు. సంపట్రావుపల్లిలో పారిశుద్ధ్యం, ఆపరేటర్ పేరుతో రూ.లక్షా 10వేలు డ్రా చేసినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. సంగినేనిపల్లిలో పారిశుధ్యం నిర్వాహణ కోసం రూ.60 వేలు, ఆపరేటర్ వేతనం కోసం రూ.8824 , తూంకుంటలో రూ.75 వేలు, గోవర్దనగిరిలో రూ.35 వేలు, కల్వరాళ్లలో రూ.40వేలు ఖర్చు చే సినట్లు అధికారులు లెక్కలు వేసి ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి డ బ్బులు డ్రా చేశారు. కానీ చాలా గ్రామా ల్లో పారిశుధ్య పనులు చేపట్టిన దాఖ లాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. విచారణ జరపాలి గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రా చేసిన నిధులపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి. గ్రామాల్లో ఉన్న మురికి గుంతలను పూడ్చి వృథా నీరు ఊర చివరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి ఆందోళనకు శ్రీకారం చుడుతాం. – శేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దృష్టి సారిస్తాం గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తాం. ప్రజా ప్రతినిధులు డ్రా చేసిన నిధులపై విచారణ జరుపుతాం. గ్రామాల్లో పర్యటించి శాశ్వత పారిశుద్ధ్య నిర్వాహణ పనుల కోసం నిధుల మంజూరుకు జిల్లా అధికారులకు నివేదికలు పంపుతాం. – బద్రినాథ్, ఇన్చార్జ్ ఈఓఆర్డీ -
ప్రకటన వచ్చిందని సైలెంట్‌గా ఉండొద్దు
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి వనపర్తిటౌన్ : ప్రశాంత రాజకీయ వాతావరణం, రాష్ట్ర రాజకీయాలను ఆకర్షించే శక్తి సురవరం ప్రతాప్‌రెడ్డి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిననాటి నుంచి ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక టీడీపీ అధ్యక్షుడు నందిమల్ల అశోక్ నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తి జిల్లా నిలుపుదల కోసం రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందని, సైలెంట్‌గా ఉంటే వ్యతిరేకులు బలపడే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీలు ఎవరిపాత్రను వారు పోషించారని రావుల పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా వచ్చిన జిల్లా ప్రకటన నిలుపుకునేందుకు గ్రామస్థాయి నుంచి వనపర్తి ఆవశ్యకతను చాటిచెప్పేందుకు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌కు ఈమెయిల్ ద్వారా విజ్ఞాపనలు అందజేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి గ్రామస్థాయి నుంచి వనపర్తి జిల్లా ప్రత్యేకతను చాటుతూ వినతిపత్రాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి. రాములు, తిరుమలయ్య, ఉంVగ్లం తిరుమల్, నందిమల్ల రమేష్, ఖాద్, నందిమల్ల శారద తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం
వనపర్తి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధిలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అప్పుల బాధతో చనిపోయిన రైతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పుష్కరాల ముగింపు రోజన రంగాపూర్ ఘాట్‌లో పిండప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రాజశేఖర్, పి.భాస్కర్, కె.వెంకటేష్, శివశంకర్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంజన్‌రెడ్డికి ఘనస్వాగతం
వనపర్త: ఆటా కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పదిహేనురోజుల తర్వాత పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి వనపర్తికి తిరికి వచ్చారు. కౌన్సిలర్లు వాకిటిశ్రీధర్,పాకనాటికృష్ణ, లక్ష్మినారాయణ, నాయకులు యోగానందరెడ్డి, తిలకేశ్వర్గౌడ్లు హరితహారం మొక్కను నిరంజన్‌రెడ్డికి అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.