అగ్నిమాపక శాఖ సిబ్బంది ఉంటున్న మహిళా సంఘం భవనం
అసలే ఎండాకాలం! ఎప్పుడు.. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవరూ చెప్పలేం.. ఎక్కడైనా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే ఆ వాహనం వస్తే తప్ప మంటలను అదుపు చేయలేని పరిస్థితి.. కానీ అలాంటి వాహనానికే రక్షణ కరువైంది.. కనీసం చిన్నపాటి షెడ్డు కూడా లేకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పుపట్టిపోతుంది.. ఇక ఆ వాహనానికి సంబంధించిన అధికారులు పనిచేసేందుకు కూడా ఒక సొంత గూడు కరువైపోయింది.. తాత్కాలికంగా ఓ అద్దె భవనంలో కాలం నెట్టుకొస్తున్నారు.. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వాహనం.. అధికారులు ఎవరో.. అదేనండి అగ్నిమాపక (ఫైరింజన్) శాఖ కార్యాలయం.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని దుస్థితి ఇది..
మహబూబ్‌నగర్ క్రైం : అగ్నిప్రమాదం బారిన పడిన ఇళ్లను, కార్యాలయాలను, పంటలను ఇ లా ఎలాంటి వాటినైనా రక్షించే బాధ్యత అగ్ని మాపక శాఖది. కానీ వాళ్లు ఉండటానికి రక్షణతో కూడిన వసతి లేకుండాపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి పునాది రాయి వేసి ఏళ్లు గ డుస్తున్నా నిర్మాణం ఇంకా పూర్తికావడం లేదు. సొంత భవనాలు లేక పట్టణ ఇందిరక్రాంతి పథకం, స్వయం సహాయ మహిళా సంఘాల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన భవనంలో తలదాచుకుంటున్నారు. ఇక మ హిళా సంఘాల సభ్యులకు ఎప్పుడైనా శిక్షణ, సమావే శం ఉంటే ఆ రోజంతా ఆరుబయట పడిగాపు లు కాయాల్సిందే. అధికారుల పరిస్థితే ఇలా ఉంటే.. అగ్నిమాపక శాఖకు చెందిన ఫైరింజన్లు నిలపడానికి ఎలాంటి షెడ్డు లేకపోవడంతో ఆరుబయట ఎండలో ఓ మూలకు ఆపారు.
అద్దె భవనాలే దిక్కు..
జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయంతోపాటు అగ్నిమాపక స్టేషన్ అధికారి కార్యాలయం రెండు అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. శాశ్వత భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి కాకపోవడంతోపాటు ఆ దిశగా ప్రయత్నాలు జరిపే నా థుడే కరువయ్యారు. 2015 సంవత్సరంలో మ ంజూరైన భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుంటే పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. పాత భవనం కూల్చిన తర్వాత అగ్నిమాపక శాఖ కార్యాలయం సొంత భవనం లేకపో వడం తో ఈ శాఖ సమస్యలను ఎదుర్కొంటుంది.
వెనక్కి వెళ్తున్న నిధులు..
పట్టణంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.74 కోట్ల నిధులను కేటాయించినా వీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. శాశ్వత భవనం లేకపోవడంతో నెలకు రూ.10 వేల వరకు అద్దె చెల్లిస్తూ డీఎఫ్‌ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ నూతన కార్యాలయ నిర్మాణానికి 2015 జూన్‌లో పునాది వేశారు. రెండు అంతస్థుల భవనం నిర్మాణం కోసం రూ.1.74 కోట్లను కేటాయించారు. దీని నిర్మాణ పనులను రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు చూసు కుంటుండగా.. నిర్మాణ పనులు మాత్రం ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే సకాలంలో నూతన భవన నిర్మాణ పనులు పూర్తికాక వచ్చిన నిధులు వెనక్కి వెళ్తున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయాలు నూతన భవన నిర్మాణాలను రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు వాళ్లు చూసుకుంటు న్నారు. గత మూడేళ్ల నుంచి కొత్త భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం డీఎఫ్‌ఓ, ఫైర్ ఆఫీసర్ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడిపిస్తున్నాం. పనులు పూర్తి చేయాలనే అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.
– శ్రీనివాసులు, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment