దోమలపై విద్యార్థులకు పరీక్షలు | dont do shamefull things | Sakshi
Sakshi News home page

దోమలపై విద్యార్థులకు పరీక్షలు

Published Mon, Sep 26 2016 11:54 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

dont do shamefull things

ఏలూరు (మెట్రో) : జిల్లా పరువు తీసే పనులు చేయవద్దని, జంగారెడ్డిగూడెంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకుండా అక్టోబర్‌ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని పట్టణంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రభుత్వానికి ఎందుకు చెప్పారని కలెక్టర్‌ కె. భాస్కర్‌ జంగారెడ్డిగూడెం మునిసిపల్‌ కమిషనర్‌ను ప్రశ్నించారు. సోమవారం పారిశుధ్యంతో పాటు వివిధ అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లతో సమీక్షించారు. చేసిన అభివృద్ధి పనులు చెప్పాలి కానీ పనులు పూర్తి చేయకుండానే బహిరంగ మలవిసర్జన లేని మునిసిపాలిటీగా ఎలా ప్రకటిస్తారని కలెక్టర్‌ ప్రశ్నించారు. 
 
దోమలపై విద్యార్థులకు పరీక్షలు
జిల్లాలో పదో తరగతిలోపు విద్యార్థులకు దోమలపై పరీక్ష నిర్వహించి 50 మార్కులు సైన్స్‌ సబ్జెక్టులో కలుపుతామని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పా రు. కలెక్టరేట్‌లో దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత ప్రచార పోస్టర్‌ను సోమవారం ఆయన విడుదల చేశా రు. నవంబర్‌ 1న విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement