22న కరువు బృందం పర్యటన | drought team tour on 22 | Sakshi
Sakshi News home page

22న కరువు బృందం పర్యటన

Published Thu, Jan 19 2017 11:31 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

drought team tour on 22

అనంతపురం సెంట్రల్‌ : జిల్లాలో కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి 22న వస్తున్న కేంద్ర కరువు బృందం పర్యటనను విజయవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 22న కరువు బృందం సభ్యులు చిలమత్తూరులోని రక్ష అకాడమీలో బస చేస్తారు.

23న హిందూపురం పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం పరిగి, గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో పర్యటిస్తారు. రాత్రికి అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో బస చేస్తారు. 24న ఉదయం విజ్ఞాపన పత్రాలు స్వీకరించిన అనంతరం కర్నూలుకు బయలుదేరి వెళ్తారు. కార్యక్రమంలో డీఆర్వో మల్లీశ్వరి, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ నాగభూషణం, హార్టికల్చర్‌ డీడీ సుబ్బరాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement