దుబ్బాకలో పేలుడు కలంకలం | Dubbakalo explosion kalankalam | Sakshi
Sakshi News home page

దుబ్బాకలో పేలుడు కలంకలం

Published Sun, Aug 14 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

దుబ్బాకలో పేలుడు కలంకలం

దుబ్బాకలో పేలుడు కలంకలం

  • బోరు కోసం ఓ వ్యక్తి పేల్చిన జిలెటిన్‌ స్టిక్స్‌
  • భారీ శబ్దానికి జనం పరుగులు
  • సమీపంలోని ఓ పెంకుటిల్లు ధ్వంసం
  • ఓ మహిళకు గాయాలు
  • దుబ్బాక: జనావాసంలో ఓ వ్యక్తి జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చడం కలకలం సృష్టించింది. భారీ శబ్దం రావడంతో జనం పరుగులు పెట్టారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఓ ఇల్లు ధ్వంసం కాగా ఓ మహిళకు గాయాలయ్యాయి. సమీపంలో జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం మండల కేంద్రమైన దుబ్బాకలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటి బోరులో బండ రాయిని పేల్చేందుకు జిలెటిన్‌ స్టిక్స్‌ను వినియోగించాడు.

    సాధారణంగా రైతులు వ్యవసాయ బోరు బావుల్లో రాళ్లను పెకిలించడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఏకంగా ఓ వ్యక్తి జనావాసాల మధ్య ఈ ప్రయోగం చేయడంతో జనం పేలుడు శబ్దానికి ఏం జరిగిందో తెలియక పరుగులు తీయాల్సి వచ్చింది. సదరు వ్యక్తితీరుపై స్థానికులు మండిపడుతున్నారు. జిలెటిన్ స్టిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement