హరితవనంగా మారుస్తాం | dwama pd haritha special interview on haritha vanam | Sakshi
Sakshi News home page

హరితవనంగా మారుస్తాం

Published Fri, Jun 24 2016 1:29 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

హరితవనంగా మారుస్తాం - Sakshi

హరితవనంగా మారుస్తాం

ఈ ఏడాది 1.5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
వాతావరణం అనుకూలిస్తే 100% సత్ఫలితాలు
అడిగిన వారందరికీ మొక్కలు పంపిణీ చేస్తాం
‘సాక్షి’తో డ్వామా పీడీ హరిత

గతేడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో హరితహారం కింద నాటిన మొక్కల్లో 40 శాతమే బతికాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మిగిలిన వాటిలో అధికశాతం టేకు మొక్కలే. ఈసారి అసాధారణ వర్షపాతం నమోదవుతుందనే సంకేతాల నేపథ్యంలో భారీ విస్తీర్ణంలో మొక్కలు నాటాలని నిర్ణయించాం. - డ్వామా పీడీ హరిత

సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘జిల్లాను హరితవనంగా మారుస్తాం. ప్రతిచోట పచ్చదనం పరుస్తాం. హరితహారం కింద 35 లక్షల మొక్కలు నాటుతాం’ అని జిల్లా గ్రామీణ నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ హరిత స్పష్టం చేశారు. చేతినిండా.. ప్రతి చేనుకు నీరు లక్ష్యంగా పథకాలను ముందుకు తీసుకెళతామని చెబుతున్న డ్వామా పీడీ హరిత ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే..

సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా అటవీ, ఉద్యానవనశాఖలతో కలిసి 1.54 కోట్ల మొక్కలు నాటడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. ఇప్పటికే నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలను మరో వారం రోజుల్లో పంపిణీ చేస్తాం. డిమాండ్‌కు తగ్గట్టుగా అడిగిన వారికల్లా మొక్కలు ఇవ్వడానికీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఇండెంట్ కోరుతున్నాం. జిల్లావ్యాప్తంగా 1,500 స్కూళ్లలో మొక్కలు నాటడానికిగానూ విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు అందా యి. వీటి సంరక్షణకు ప్రభుత్వమే నిధులు ఇవ్వనుంది.

 దారులు.. హరివిల్లులు
రోడ్లకిరువైపులా మొక్కలు నాటనున్నాం. 287 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, 117 కిలోమీటర్ల మేరలో ప్రతిపాదించిన  పంచాయతీరాజ్ రహదారుల పక్కన మొక్కలు నా టడానికి ప్రణాళిక రూపొందించాం. వీటి నిర్వహణ ఆయా శాఖలే చూసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్ల మీద పెం చుకోవడానికి రైతాంగానికి 2.20 లక్షల ఈత, ఖర్జూర మొ క్కలను అందజేయనున్నాం. వీటి నిర్వహణకయ్యే ఖర్చు ను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొక్క పోషణ కింద నెలకు రూ.5 ఇవ్వనున్నాం. బహిరంగ ప్రదేశాల్లో నాటే మొక్కలను సంరక్షించేందుకు ముళ్ల కంచెలు వేసుకోవడానికి రూ.110 ఇస్తాం. మిషన్ కాకతీయ కింద తొలిదశలో పునరుద్ధరించిన 110 చెరువుల గట్ల మీద హరితహారం కింద మొక్కలకు ఊపిరిలూదనున్నాం.

 వేగంగా ముందుకెళ్తున్నాం..
ఈజీఎస్ పథకం అమలులో ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లా పలు అంశాల్లో అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 5,907 కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచాం. అదేవిధంగా అత్యధిక పనిదినాలు కల్పించి 108.54 శాతం పురోగతి సాధించాం. ఉపాధి కూలీలకు 82.23% డబ్బులు చెల్లించి రెండో స్థానంలో నిలిచాం. సగటు పనిదినాలు కల్పించడంలోనూ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాం.

శివారు మండలాలకు ఉపాధి విస్తరణ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద  నగర శివార్లలోనూ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మేడ్చల్, కీసర, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల్లో ఇకపై ఈజీఎస్ కింద పనులు చేపట్టనున్నాం. కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాలు పట్టణ ప్రాంతాలుగా అవతరించడంతో ఉపాధి పనులు చేపట్టం సాధ్యంకాదని ఆ మండలాల ఎంపీడీఓలు నివేదిక ఇచ్చారు. దీంతో ఈ మండలాలను మినహాయించి మిగతా వాటిలోని 186 పంచాయతీల్లో పనుల గుర్తింపునకు సంబంధించి గ్రామసభలు నిర్వహిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement