green garden
-
హరితవనంగా మారుస్తాం
♦ ఈ ఏడాది 1.5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం ♦ వాతావరణం అనుకూలిస్తే 100% సత్ఫలితాలు ♦ అడిగిన వారందరికీ మొక్కలు పంపిణీ చేస్తాం ♦ ‘సాక్షి’తో డ్వామా పీడీ హరిత గతేడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో హరితహారం కింద నాటిన మొక్కల్లో 40 శాతమే బతికాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మిగిలిన వాటిలో అధికశాతం టేకు మొక్కలే. ఈసారి అసాధారణ వర్షపాతం నమోదవుతుందనే సంకేతాల నేపథ్యంలో భారీ విస్తీర్ణంలో మొక్కలు నాటాలని నిర్ణయించాం. - డ్వామా పీడీ హరిత సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘జిల్లాను హరితవనంగా మారుస్తాం. ప్రతిచోట పచ్చదనం పరుస్తాం. హరితహారం కింద 35 లక్షల మొక్కలు నాటుతాం’ అని జిల్లా గ్రామీణ నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ హరిత స్పష్టం చేశారు. చేతినిండా.. ప్రతి చేనుకు నీరు లక్ష్యంగా పథకాలను ముందుకు తీసుకెళతామని చెబుతున్న డ్వామా పీడీ హరిత ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా అటవీ, ఉద్యానవనశాఖలతో కలిసి 1.54 కోట్ల మొక్కలు నాటడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. ఇప్పటికే నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలను మరో వారం రోజుల్లో పంపిణీ చేస్తాం. డిమాండ్‌కు తగ్గట్టుగా అడిగిన వారికల్లా మొక్కలు ఇవ్వడానికీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఇండెంట్ కోరుతున్నాం. జిల్లావ్యాప్తంగా 1,500 స్కూళ్లలో మొక్కలు నాటడానికిగానూ విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు అందా యి. వీటి సంరక్షణకు ప్రభుత్వమే నిధులు ఇవ్వనుంది. దారులు.. హరివిల్లులు రోడ్లకిరువైపులా మొక్కలు నాటనున్నాం. 287 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు, 117 కిలోమీటర్ల మేరలో ప్రతిపాదించిన పంచాయతీరాజ్ రహదారుల పక్కన మొక్కలు నా టడానికి ప్రణాళిక రూపొందించాం. వీటి నిర్వహణ ఆయా శాఖలే చూసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్ల మీద పెం చుకోవడానికి రైతాంగానికి 2.20 లక్షల ఈత, ఖర్జూర మొ క్కలను అందజేయనున్నాం. వీటి నిర్వహణకయ్యే ఖర్చు ను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొక్క పోషణ కింద నెలకు రూ.5 ఇవ్వనున్నాం. బహిరంగ ప్రదేశాల్లో నాటే మొక్కలను సంరక్షించేందుకు ముళ్ల కంచెలు వేసుకోవడానికి రూ.110 ఇస్తాం. మిషన్ కాకతీయ కింద తొలిదశలో పునరుద్ధరించిన 110 చెరువుల గట్ల మీద హరితహారం కింద మొక్కలకు ఊపిరిలూదనున్నాం. వేగంగా ముందుకెళ్తున్నాం.. ఈజీఎస్ పథకం అమలులో ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లా పలు అంశాల్లో అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 5,907 కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచాం. అదేవిధంగా అత్యధిక పనిదినాలు కల్పించి 108.54 శాతం పురోగతి సాధించాం. ఉపాధి కూలీలకు 82.23% డబ్బులు చెల్లించి రెండో స్థానంలో నిలిచాం. సగటు పనిదినాలు కల్పించడంలోనూ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాం. శివారు మండలాలకు ఉపాధి విస్తరణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నగర శివార్లలోనూ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మేడ్చల్, కీసర, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల్లో ఇకపై ఈజీఎస్ కింద పనులు చేపట్టనున్నాం. కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాలు పట్టణ ప్రాంతాలుగా అవతరించడంతో ఉపాధి పనులు చేపట్టం సాధ్యంకాదని ఆ మండలాల ఎంపీడీఓలు నివేదిక ఇచ్చారు. దీంతో ఈ మండలాలను మినహాయించి మిగతా వాటిలోని 186 పంచాయతీల్లో పనుల గుర్తింపునకు సంబంధించి గ్రామసభలు నిర్వహిస్తున్నాం. -
మొక్కు బడి
♦ జిల్లా మొత్తం కోటి మొక్కల పెంపకం లక్ష్యం ♦ అరకొర నిధులు.. కొరవడిన పర్యవేక్షణ ♦ నీరుగారుతున్న అటవీ శాఖ ఆశయం జిల్లాలో కోటి మొక్కలు పెంచాలి.. పచ్చదనం కనువిందు చేయాలి.. హరిత వనం ఆహ్లాదాన్ని పంచాలి.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి.. ఇదీ అటవీ శాఖ సంకల్పం. ఆశయం వరకు బాగానే ఉంది.. ఆచరణలోకొచ్చేసరికి అంతా తుస్సు మంటోంది. మొక్కల పెంపకం మొక్కుబడిగా సాగుతోంది.. నిధుల విడుదల అంతంతమాత్రంగానే ఉంది. వెరసి అటవీ శాఖ.. సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం ప్రహసనంగా మారుతోంది. కడప అర్బన్: అటవీశాఖ, సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటుచేసి వాటి ద్వారా జిల్లాలో పచ్చదనం తీసుకు రావాలని చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. కోటి మొక్కలు పెంచాలనే లక్ష్యంతో లక్షలాది రూపాయలను ఖర్చు చేసి నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేని కారణంగా అవి చెట్లుగా మారడం అనుమానంగా కనిపిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మినహా మిగతా పథకాల నుంచి నిధులు రాకపోవడంతో నర్సరీలు నత్తనడక న సాగుతున్నాయి. కడప నగర శివార్లలోని రాజీవ్ స్మృతివనం ఇందుకుఠ నిదర్శనంగా నిలుస్తోంది. కడప నగర వనంలో ప్రస్తుతానికి మొక్కలు నాటేందుకు గుంతలు మాత్రమే తవ్వారు. ఇంకా మొక్కలను నాటేందుకు సమయం పడుతుందని వేచి చూస్తున్నారు. నర్సరీల నుంచి ఆయా ప్రాంతాలకు మొక్కలు వెళ్లినప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల పెరుగుదల లేదని తెలుస్తోంది. జిల్లాలో నర్సరీల వివరాలు ఇలా.. ♦ జిల్లాలో 11 సెంట్రల్ నర్సరీ యూనిట్లు ఉన్నాయి. సామాజిక అటవీ విభాగంలో 2014 -15 సంవత్సరాలకు సంబంధించి 35 లక్షల మొక్కలను అభివృద్ధి చేయాలనే లక్ష్యం కాగా, 29. 5 లక్షల మొక్కలను పెంచారు. ♦ 2015- 16 సంవత్సరాలకు గాను, 40 లక్షలు లక్ష్యం కాగా, 30 లక్షల మొక్కలను పెంచారు. ♦ కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్ల వారీగా మొత్తం 60 లక్షల మొక్కలను పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కడప సబ్ డివిజన్ పరిధిలో కడప సబ్ డివిజన్ పరిధిలో 25 లక్షల మొక్కలను ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దాదాపు తొమ్మిది నర్సరీలలో మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ పరిధి లో కడప రాజీవ్ స్మృతివనం, కనుమలోపల్లె, ఒంటిమిట్ట, సిద్దవటం, రాయచోటి, వేంపల్లె పరి ధుల్లో నర్సరీలు ఉన్నాయి. మొక్కలను పెంచడంలోగానీ, వాటిని వినియోగించడంలోగానీ, జాబ్‌కార్డులు ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో గత ఏడాది అటవీశాఖ ఆధ్వర్యంలో 15 లక్ష లు, స్కూలు నర్సరీల పరిధిలో 10 లక్షల మొక్కలను పెంచారు. ఈ ఏడాది 150 హెక్టార్లలో 1.66 లక్ష లు మాత్రమే స్కూలు నర్సరీల్లోనూ, రెండు లక్ష ల మొక్కలు అటవీశాఖ పరిధిలోని నర్సరీలలో పెంచుతున్నారు. ఇక్కడ నర్సరీలన్నీ ఉపాధి హామీ పథకం నిధులతో నడుస్తున్నాయి. అయితే వీటిలో చాలా చోట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. దీం తో లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయి. రాజంపేట పరిధిలో రాజంపేట అటవీ శాఖ పరిధిలో 10 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. నర్సరీల ద్వారా 11 లక్షల మొక్కలను పెంచారు. రాజంపేట ఫారెస్టు డివిజన్ పరిధిలో సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో పుల్లంపేట మండలంలోని పుత్తనవారిపల్లె వద్ద 15 యేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సామాజిక అటవీశాఖ నర్సరీ కేంద్రాన్ని ఎత్తివేశారు. ఈ నర్సరీ కేంద్రానికి లక్షలాది రూపాయలు వెచ్చించి ఇప్పుడు నిరుపయోగంగా మార్చేశారు. అక్కడి నీటి సమస్య ఉందనే కారణాన్ని చూపి ఆ శాఖ అధికారులు మొక్కల పెంపకాన్ని నిలిపివేసినట్లు తె లుస్తోంది. వర్షాలు ప్రారంభమైతే ఉచితంగా మొక్కలు ప్రస్తుతం అన్ని నర్సరీలలో మొక్కలు ప్రాథమిక దశలో పెరుగుతున్నాయి. కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించిన వెంటనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలను పెంచుకునేందుకు అవసరమైన మేరకు నిధులు సమకూరుస్తున్నారు. జాబ్‌కార్డు ఉన్న వారికే కాకుండా అవసరమైన వారికి మొక్కలు పెంచడంలోగానీ, పంపిణీలోగానీ అవకాశం కల్పిస్తే మెరుగ్గా ఉంటుంది. వర్షాలు ప్రారంభమైతే అవసరమైన వారందరికీ ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తాం. - మహమ్మద్ దివాన్ మైదిన్, కడప డీఎఫ్ఓ