EGS scheme
-
ఉపాధి హామీ కింద కొత్తగా 95 పనులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద కొత్తగా 95 పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పనులకు ఆదనంగా ఈ ఏడాది నుంచి ఈజీఎస్ కింద ఈ పనులను చేపట్టనుంది. ఈ మేరకు కొత్తగా గుర్తించిన పనులు, అంచనా వ్యయం, వేతనం, సామగ్రి, పనిదినాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా పనుల్లో వినియోగించాల్సిన సామగ్రి, వేతనం, పనిదినాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
కూలీలతో సహ‘వాసం’
కాటారం: ఆయన జిల్లా బాస్.. అంతకుమించి మేజిస్ట్రేట్ కూడా. ఇవన్నీ పక్కన పెట్టి కూలీలతో కలసి పలుగు పట్టారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. కాటారం మండలం గంగారంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపలకుంటలో చేపట్టిన పనులను గురువారం కలెక్టర్ బుల్లెట్‌పై వెళ్లి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతోపాటు పలుగు పట్టి మట్టి తవ్వగా ఇతర అధికారులు తవ్వి న మట్టిని ఎత్తిపోశారు. అనంతరం కూలీలతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. స్వయంగా కలెక్టర్ తమతో కలసి పనిచేయడం, ఆప్యాయంగా పలకరించడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. -
వ్యవసాయానికి ఉపాధి దక్కేనా..!
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రోజువారి పనుల్లో పాల్గొంటున్న వారిని వ్యవసాయరంగంలో సైతం సేవలు చేసేలా మార్పులు చేయాలని రైతులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే వ్యవసాయరంగానికి చేయూత ఇచ్చినట్లు అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూలపల్లి: పనులు లేని రోజుల్లో గ్రామాల్లో ఉండే పేద ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలని తీసుకొచ్చిన పథకం గ్రామీణ ఉపాధిహామీ పథకం. వ్యవసాయ పనులు లేని సమయాల్లో గ్రామల్లో ఉండే కూలీలు వలసపోకుండా అక్కడే పని కల్పించి ఉపాధి చూపెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. 2005లో చట్టం చేయబడి 2006లో ఉపాధిహామీ పథకం అమలులోకి వచ్చింది. మొదట్లో రోజుకు రూ.80 కూలీ ఇచ్చేవారు. ప్రస్తుతం రోజుకు రూ.205 ఇస్తున్నారు. ఈజీఎస్ పథకం కింద 45 శాతం యంత్రాలు, 55 శాతం కూలీలకు డబ్బులు ఇస్తున్నారు. పరిస్థితి ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద పని చేసేవారు ఉదయం వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వస్తారు. దీంతో చాలా మంది కూలీలు వ్యవసాయ పనులకు రావడం లేదని వ్యవసాయదారులు అంటున్నారు. పంట సాగు చేసేప్పుడు, కోతలకు వచ్చిన సమయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి సంపూర్ణంగా అనుసంధానం చేస్తేనే చాలా ఉపయోగముంటుందని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో 80 శాతం రైతులు సన్న, చిన్నకారు రైతులే. వారు వ్యవసాయ పనులు లేని సమయాల్లో ఉపాధి పనులకు వెళుతుంటారు. వ్యవసాయానికి ఉపాధిహామీని లింక్ చేస్తే ఇరువర్గాలకు లాభం చేకూరుతుందని వీరి వాదన. వ్యవసాయంలో 70 నుంచి 80 పనిదినాలకు మించి పనులు దొరకడం లేదని, 170 నుంచి 180 రోజులు పని ఉంటేనే ప్రధాన పనిదారుడు అంటున్నారని, అది కూడా గ్రామాల్లో లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. జిల్లా పరిస్థితి ఇది.. జిల్లాలో మొత్తం 1,07,324 జాబ్ కార్డులు ఉండగా.. 2,41,058 మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది 61,682 పని దినాలు 98,496 మందికి పని కల్పించారు. రూ.4,442.94 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర నిర్ణయంపైనే.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఈజీఎస్‌తో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. రాజేంద్రనగర్, కరీంనగర్ రైతు సమన్వయ సమితి సమావేశాల్లో సైతం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాగా వ్యవసాయ రంగానికి అనుసంధానిస్తే కూలీల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, దారి తప్పిన ఈ స్కీమ్‌లో లోపాలు సరిచేయకుండా వ్యవసాయరంగానికి లింక్ చేస్తే మరింత అవినీతి జరిగే ప్రమాదముందని మరికొన్ని వర్గాల వాదనలున్నాయి. కాగా ఇప్పటికే 28 రకాల వ్యవసాయ పనులకు ఉపాధిహామీని లింక్ చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో వ్యవసాయరంగానికి అనుసంధానిస్తేనే రైతు ప్రగతి సాధ్యమని రైతులు కోరుతున్నారు. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంది. వ్యవసాయానికి అనుసంధానించాలి ఉపాధిహామీని వ్యవసాయానికి లింక్ చేస్తే రైతుకు ఖర్చు తగ్గడంతోపాటు సకాలంలో పనులు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రంగాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేసి రైతులు, కూలీలను ఆదుకోవాలి -కొత్త మల్లేశం, రైతు, కుమ్మరికుంట సమాచారం రాలేదు ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానించే సమాచారం ఏమీ ప్రభుత్వం నుంచి రాలేదు. చాలామంది రైతులు ఇదే అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. వస్తే బాగుంటుంది. ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. -ప్రేమ్‌కుమార్, డీఆర్డీవో -
హరితవనంగా మారుస్తాం
♦ ఈ ఏడాది 1.5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం ♦ వాతావరణం అనుకూలిస్తే 100% సత్ఫలితాలు ♦ అడిగిన వారందరికీ మొక్కలు పంపిణీ చేస్తాం ♦ ‘సాక్షి’తో డ్వామా పీడీ హరిత గతేడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో హరితహారం కింద నాటిన మొక్కల్లో 40 శాతమే బతికాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మిగిలిన వాటిలో అధికశాతం టేకు మొక్కలే. ఈసారి అసాధారణ వర్షపాతం నమోదవుతుందనే సంకేతాల నేపథ్యంలో భారీ విస్తీర్ణంలో మొక్కలు నాటాలని నిర్ణయించాం. - డ్వామా పీడీ హరిత సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘జిల్లాను హరితవనంగా మారుస్తాం. ప్రతిచోట పచ్చదనం పరుస్తాం. హరితహారం కింద 35 లక్షల మొక్కలు నాటుతాం’ అని జిల్లా గ్రామీణ నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ హరిత స్పష్టం చేశారు. చేతినిండా.. ప్రతి చేనుకు నీరు లక్ష్యంగా పథకాలను ముందుకు తీసుకెళతామని చెబుతున్న డ్వామా పీడీ హరిత ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా అటవీ, ఉద్యానవనశాఖలతో కలిసి 1.54 కోట్ల మొక్కలు నాటడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. ఇప్పటికే నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలను మరో వారం రోజుల్లో పంపిణీ చేస్తాం. డిమాండ్‌కు తగ్గట్టుగా అడిగిన వారికల్లా మొక్కలు ఇవ్వడానికీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఇండెంట్ కోరుతున్నాం. జిల్లావ్యాప్తంగా 1,500 స్కూళ్లలో మొక్కలు నాటడానికిగానూ విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు అందా యి. వీటి సంరక్షణకు ప్రభుత్వమే నిధులు ఇవ్వనుంది. దారులు.. హరివిల్లులు రోడ్లకిరువైపులా మొక్కలు నాటనున్నాం. 287 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు, 117 కిలోమీటర్ల మేరలో ప్రతిపాదించిన పంచాయతీరాజ్ రహదారుల పక్కన మొక్కలు నా టడానికి ప్రణాళిక రూపొందించాం. వీటి నిర్వహణ ఆయా శాఖలే చూసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్ల మీద పెం చుకోవడానికి రైతాంగానికి 2.20 లక్షల ఈత, ఖర్జూర మొ క్కలను అందజేయనున్నాం. వీటి నిర్వహణకయ్యే ఖర్చు ను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొక్క పోషణ కింద నెలకు రూ.5 ఇవ్వనున్నాం. బహిరంగ ప్రదేశాల్లో నాటే మొక్కలను సంరక్షించేందుకు ముళ్ల కంచెలు వేసుకోవడానికి రూ.110 ఇస్తాం. మిషన్ కాకతీయ కింద తొలిదశలో పునరుద్ధరించిన 110 చెరువుల గట్ల మీద హరితహారం కింద మొక్కలకు ఊపిరిలూదనున్నాం. వేగంగా ముందుకెళ్తున్నాం.. ఈజీఎస్ పథకం అమలులో ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లా పలు అంశాల్లో అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 5,907 కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచాం. అదేవిధంగా అత్యధిక పనిదినాలు కల్పించి 108.54 శాతం పురోగతి సాధించాం. ఉపాధి కూలీలకు 82.23% డబ్బులు చెల్లించి రెండో స్థానంలో నిలిచాం. సగటు పనిదినాలు కల్పించడంలోనూ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాం. శివారు మండలాలకు ఉపాధి విస్తరణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నగర శివార్లలోనూ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మేడ్చల్, కీసర, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల్లో ఇకపై ఈజీఎస్ కింద పనులు చేపట్టనున్నాం. కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాలు పట్టణ ప్రాంతాలుగా అవతరించడంతో ఉపాధి పనులు చేపట్టం సాధ్యంకాదని ఆ మండలాల ఎంపీడీఓలు నివేదిక ఇచ్చారు. దీంతో ఈ మండలాలను మినహాయించి మిగతా వాటిలోని 186 పంచాయతీల్లో పనుల గుర్తింపునకు సంబంధించి గ్రామసభలు నిర్వహిస్తున్నాం.