
కూలీలతో పాటు పలుగు పట్టిన కలెక్టర్
కాటారం: ఆయన జిల్లా బాస్.. అంతకుమించి మేజిస్ట్రేట్ కూడా. ఇవన్నీ పక్కన పెట్టి కూలీలతో కలసి పలుగు పట్టారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. కాటారం మండలం గంగారంలో
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపలకుంటలో చేపట్టిన పనులను గురువారం కలెక్టర్ బుల్లెట్‌పై వెళ్లి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతోపాటు పలుగు పట్టి మట్టి తవ్వగా ఇతర
అధికారులు తవ్వి న మట్టిని ఎత్తిపోశారు. అనంతరం కూలీలతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. స్వయంగా కలెక్టర్ తమతో కలసి పనిచేయడం, ఆప్యాయంగా పలకరించడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.