Jayashankar Bhupalpally
-
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్‌గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
-
మహిళా కానిస్టేబుల్స్ పై SI లైంగిక వేధింపులు..
-
కాంగ్రెస్‌పైనే ఓటర్ల కన్ను? భూపాలపల్లిలో ఉత్కంఠ!
రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోదావరి పరివాహక ప్రాంతం అయినా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలుపుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గం ఆసక్తికర అంశాలు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతం సింగరేణి కార్మికులకు నిలయమైన నియోజకవర్గం. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పోడు భూములు. డబుల్ బెడ్రూం ఇవ్వకపోవడం ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ గండ్ర వెంకట రమణారెడ్డి(కన్ఫర్మ్) కాంగ్రెస్ గండ్ర సత్యనారాయణ (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) బీజేపీ చందుపట్ట కీర్తి రెడ్డి (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : భూపాలపల్లి నియోజకవర్గంలో దట్టమైన అటవీ ప్రాంతం, కాకతీయులు పాలించిన కోట గుళ్ల గణపేశ్వర ఆలయం, కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంల, పర్యాటక పాండవుల గుట్టలు, విద్యుత్ వెలుగుల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు,సింగరేణి బొగ్గు గనులు,గణపసముద్రం -
ప్రేమికుడితో దిగిన ఫొటోలు వైరల్.. యువతి ఆత్మహత్య
భూపాలపల్లి అర్బన్/రామన్నపేట/నర్సంపేట రూరల్: ప్రేమికుడితో దిగిన ఫొటోలను అతను మరో యువకుడికి పంపడం, ఇద్దరూ కలిసి బ్లాక్మెయిల్ చేయడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముగ్ధుంపురం శివారులో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతోంది. అయితే తన కుమార్తె కన్పించడం లేదంటూ రక్షిత తండ్రి శంకరాచారి ఈ నెల 22న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా 24న రక్షిత ఆచూకీ లభించింది. విచారణ సందర్భంగా..తన ప్రేమికుడితో దిగిన ఫొటోలను అతను వేరొకరికి పంపిన విషయం, ఇతర వివరాలు ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి పంపేశారు. ఈ ఇద్దరు యువకులూ భూపాలపల్లికి చెందిన వారేనని మట్టెవాడ పోలీసులు తెలిపారు. కాగా సరదాగా తీసుకున్న ఫొటోలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన రక్షిత ఆదివారం వరంగల్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ర్యాగింగ్ ఆరోపణలపై కాలేజీ యాజమాన్యం ఖండన ‘పబ్బోజు రక్షిత అనే విద్యార్థిని మా కళాశాలలోనే ఈసీఈ విభాగంలో అడ్మిషన్ పొందింది. రెండేళ్లు కళాశాలలోనే చదివింది. కానీ బ్యాక్‌లాగ్‌లు ఎక్కువగా ఉండడంతో మూడో సంవత్సరంలో డిటెండ్ అయింది. దీంతో ఆరు నెలలుగా కళాశాలకు రావడం లేదు. కళాశాలకు రాని విద్యార్థినిని ఎవరు ర్యాగింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వైరల్ అవుతోంది..’ అని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. -
‘డర్టీ డజన్ ఎమ్మెల్యేలు, దొరగాని దొడ్లో పశువులుగా మారారు’
సాక్షి భూపాలపల్లి/మొగుళ్లపల్లి: ‘మేం గెలిపిస్తే.. మా గుండెల మీద తన్ని, ఆస్తుల సంపాదన కోసం కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగాని దొడ్లో పశువులుగా మారారు’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌నుద్దేశించి ’’నక్సలైట్ ఎజెండా అంటివి ఏమైంది? మోసం చేసిన కోవర్టులకే మంత్రి పదవులా..’అంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది. రాత్రి మొగుళపల్లి మండల కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ధరణితో దందాలు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఉపాధి లభించక, కనిపెంచిన తల్లిదండ్రుల బాధలు చూడలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక్క ఇల్లూ ఇవ్వలేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, ముదనష్టపోడు కేసీఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. పసి పిల్లాడిని కుక్కలు పీక్కొని తింటే పట్టించుకోని దుర్మార్గ ప్రభుత్వం ఇదని రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్‌దే స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్‌దేనని అన్నారు. ఆయనను ఎమ్మెల్యేను, చీఫ్‌విప్‌ను చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ విషయాలపై మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం సాక్షిగా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. -
త్రివర్ణ గణపేశ్వరుడు
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాలయంలో శ్రావణ సోమవారంతోపాటు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గణపేశ్వరుడిని జాతీయ పతాక రంగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ముసునూరి నరేశ్స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. -
గేదెలపై పెద్దపులి పంజా
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రెండు రోజులుగా పులి బీభత్సం సృష్టిస్తోంది. ఈ మేరకు మండలంలోని ఒడిపిలవంచ సమీపంలో ఓ ఆవుదూడను చంపిన పెద్దపులి.. తాజాగా ఆ గ్రామానికి సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో గేదెల గుంపుపై దాడి చేసి దున్నను ఎత్తుకెళ్లింది. గుమ్మాళ్లపల్లికి చెందిన ఓదేలు అనే పశువుల కాపరి అదే గ్రామానికి చెందిన పలువురు రైతుల గేదెలను మేత కోసం సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. గేదెలు మేత మేస్తున్న క్రమంలో హఠాత్తుగా పులి గేదెల గుంపుపైకి దూసుకువచ్చినట్లు పశువుల కాపరి తెలిపాడు.పులి దాడిని గమనించి ఓదేలు భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడు. జరిగిన సంఘటనపై ప్రజాప్రతినిధుల ద్వారా అటవీశాఖ అధికారులు, పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. డీఎస్పీ బోనాల కిషన్, సీఐ రంజిత్‌రావు, ఎఫ్డీఓ వజ్రారెడ్డి, ఎఫ్ఆర్వో స్వాతి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గేదెల మందలోనుంచి రాజయ్య అనే రైతుకు చెందిన దున్నపోతును పులి ఎత్తుకెళ్లినట్లు ఓదేలు చెప్పాడు. ఘటనా స్థలంలో రక్తం మరకలు, పులి పాదాల గుర్తులను అధికారులు సేకరించారు. పులి ఆచూకీని గుర్తించడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని డీఎస్పీ బోనాల కిషన్, అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు. -
ప్రియుడి బెదిరింపు.. ఎన్కౌంటర్ చేస్తా..!
టేకుమట్ల: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడో ప్రేమికుడు. దీంతో యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. టేకుమట్లకు చెందిన కొలుగూరి కార్తీక్ ఆర్మీ జవాన్. రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన తమ బంధువైన ఓ యువతిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ యువతి పెళ్లి చేసుకోమని అడగగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఫోన్లో సంప్రదిస్తే ‘నేను ఎన్కౌంటర్ స్పెషలిస్టును, ఎన్కౌంటర్ చేస్తా. నీకు దిక్కున్న చోట చెప్పుకో. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు.’అని బెదిరిస్తున్నాడని యువతి వాపోయింది. కార్తీక్‌తో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. చివరకు కుటుంబ సభ్యులతో కలసి శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కార్తీక్ ఇంటి ఎదుట మౌన దీక్ష చేపట్టింది. -
ఆగమాగం!
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలోనూ వర్షం కురిసింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అంతా నిద్రలో ఉన్న సమయంలో వర్షం కురవగా రైతులు తేరుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంటాలు కాని ధాన్యంతో పాటు కాంటాలు పూర్తయిన ధాన్యం కూడా తడిసిపోయింది. లారీల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడం లేదు. దీంతో తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో జనం బెంబేలెత్తిపోయారు. పలు చోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు పడిపోయాయి. జిల్లావ్యాప్తంగా సగటున 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భీమారంలో 110 మిల్లీమీటర్ల వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అర్ధరాత్రికావడం.. భారీ వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు ఆగమాగం అయ్యారు. జిల్లావ్యాప్తంగా 155 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో కారుపై పడిన చెట్టు -
విషాదం : ఆ సీసా గురించి మామకు తెలియక పోవడంతో..
సాక్షి, కాటారం/భూపాలపల్లి: కూతురు భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంత్యక్రియలకు హాజరైన మామ కార్యక్రమాలు ముగిశాక మద్యం తాగుదామని భావించాడు. అయితే పొరపాటున అల్లుడు పురుగు మందు కలుపుకొని తాగిన మద్యం సీసాలోని మందే తాగడంతో ఆయన కూడా కన్నుమూయడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. జిల్లాలోని మల్హర్ మండలం పెద్దతూండ్లకు చెందిన పోలు రవి(45) చిన్న కుమార్తెను కాటారానికి చెందిన మద్ది నాగరాజు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే, నాగరాజు అప్పుల బాధతో మద్యంలో పురుగు మందు కలుపుకుని ఈనెల 6న తాగాడు. చికిత్స పొందుతూ 7న మృతి చెందాడు. దీంతో రవి దంపతులు నాగరాజు అంత్యక్రియల కోసం కాటారానికి వచ్చారు. శుక్రవారం రాత్రి అంత్యక్రియలు ముగి శాక మద్యం బాటిల్‌ను తెచ్చుకుందామని వైన్స్‌కు వెళ్లే క్రమంలో నాగరాజు బెడ్రూంలో మద్యం సీసా కనిపించింది. అది సాధారణ మద్యమే అనుకున్న రవి తాగాడు. కానీ అదే సీసాలో నాగరాజు పురుగు మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియదు. దీంతో ఆ మందు తాగగానే రవి సైతం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. కాగా, రవి, నాగరాజు మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
బుల్లెట్‌పై వెళ్లి పత్తి ఏరిన కలెక్టర్..
భూపాలపల్లి రూరల్ : పల్లె ప్రగతి పనుల చివరి రోజు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం పలు గ్రామాలను సందర్శించారు. ఆముదాలపల్లికి బుల్లెట్ వాహనంపై వెళ్లారు. మార్గమధ్యలో పత్తి చేలల్లో కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలతో కలసి పత్తి ఏరుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి పత్తి ఏరుతున్న ఇంటర్ విద్యార్థిని ఝాన్సీతో కాసేపు మాట్లాడారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఝాన్సీని అభినందించిన కలెక్టర్, బాగా చదువుకోవాలని అన్నారు. -
భూపాలపల్లి.. ఆరోగ్యం అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యం, పోషకాహారం అందించడంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మొత్తం దేశంలోని 117 ఆశావహ జిల్లాలకు ర్యాంకులను కేటాయించిన నీతి ఆయోగ్, భూపాలపల్లి జిల్లా చేసిన కృషిని ప్రశంసించింది. ఈ మేరకు ఆగస్టు–2019 డెల్టా ర్యాంకులను సోమవారం ప్రకటించింది. గతంలో ఆరోగ్యం, పోషకాహారం వంటి విషయాల్లో భూపాలపల్లి జిల్లా స్కోరు 64గా ఉండగా.. ఈసారి 73కు చేరింది. దీంతో మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపింది. ర్యాంకింగ్ ఇలా.. డెల్టా ర్యాంకింగ్‌లో ఇతర అంశాలతోపాటు ఆరోగ్యం, పోషకాహారానికి 30 శాతం మార్కులను కేటాయిస్తారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిగణనలోకి తీసుకుంటారు. 32 ఆరోగ్య, పోషకాహార అంశాలపై ఈ ర్యాంకింగ్‌ను నిర్ధారించారు. ఐసీడీఎస్‌ల ద్వారా వారికి అందుతున్న ప్రత్యేక పోషకాహార కార్యక్రమం అమలును కూడా నీతి ఆయోగ్ పరిశీలించింది. ఎనీమియాతో బాధపడుతున్న మహిళలను గుర్తించి వారికి సరైన వైద్యం అందించడంలో చేసిన కృషికి కూడా మార్కులు వేసింది. గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలను కనీసం 4 సార్లు కంటే ఎక్కువగా చేయడాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. స్త్రీ, పురుషుల నిష్పత్తి, ఆస్పత్రుల్లో ప్రసవాలు, శిశువు పుట్టిన గంటలోపు తల్లి పాలు అందించడం, తక్కువ బరువుతో పుట్టే శిశువుల శాతాన్ని తగ్గించడం, ఐదేళ్లలోపు తక్కువ బరువున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ, డయేరియా రాకుండా చిన్నారులకు వోఆర్ఎస్ వంటి పానీయాలు అందించడంలో చేస్తున్న కృషిని నీతి ఆయోగ్ పరిశీలించింది. వీటిలో అనేక వాటిల్లో భూపాలపల్లి జిల్లా మంచి ప్రతిభ కనబర్చిందని తెలిపింది. అలాగే క్షయ వ్యాధి నివారణకు చేపడుతున్న చర్యలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏ మేరకు వెల్నెస్ సెంటర్లుగా మార్చుతున్నదీ పరిగణలోకి తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామాల్లో చేపట్టే పారిశుద్ధ్య, పోషకాహార కార్యక్రమాలను కూడా ర్యాంకింగ్‌కు తీసుకున్నారు. అంగన్వాడీలకు ఉన్న సొంత భవనాలనూ మార్కులకు ప్రాతిపదికగా తీసుకోవడం విశేషం. ఆరోగ్యం, పోషకాహారంలో డెల్టా ర్యాంకింగ్ సాధించిన, ఆయా అంశాలపై పర్యవేక్షణ చేసిన భూపాలపల్లి కలెక్టర్‌ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అభినందించారు. ఇక డెల్టా ర్యాంకింగ్‌లో ఆసిఫాబాద్ జిల్లా 39వ ర్యాంకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 63వ ర్యాంకు సాధించాయని నివేదిక తెలిపింది. -
కూలీలతో సహ‘వాసం’
కాటారం: ఆయన జిల్లా బాస్.. అంతకుమించి మేజిస్ట్రేట్ కూడా. ఇవన్నీ పక్కన పెట్టి కూలీలతో కలసి పలుగు పట్టారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. కాటారం మండలం గంగారంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపలకుంటలో చేపట్టిన పనులను గురువారం కలెక్టర్ బుల్లెట్‌పై వెళ్లి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతోపాటు పలుగు పట్టి మట్టి తవ్వగా ఇతర అధికారులు తవ్వి న మట్టిని ఎత్తిపోశారు. అనంతరం కూలీలతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. స్వయంగా కలెక్టర్ తమతో కలసి పనిచేయడం, ఆప్యాయంగా పలకరించడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. -
ఫ్యూజ్ మారుస్తుండగా ప్రాణాలే పోయాయ్
సాక్షి, ములుగు రూరల్: ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మార్చుతూ విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. మల్లంపల్లికి చెందిన మోత్కూరి సుధాకర్(43) తన వ్యవసాయ భూమిలో అరటి తోట సాగు నిమిత్తం చేను తడిపేందుకు శుక్రవారం నీరు పారిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ కొట్టేయడంతో మోటార్ ఆగిపోయింది. దీంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
జయశంకర్ భూపాలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం రాంనగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గారె నారాయణ, వెంకటమ్మల కుమార్తె గారె సులోమిని(17) ములుగులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు జరుగుతుండటంలో మరస్తాపానికి గురై బలవర్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రణరంగంగా మారిన తాడ్వాయి అటవీ ప్రాంతం
-
మహిళలను చెట్టుకు కట్టేసి చావబాదారు
-
అడవిలో అరాచకం
► గొత్తికోయలపై అటవీశాఖ సిబ్బంది దౌర్జన్యం ► 36 కుటుంబాలపై విరుచుకుపడ్డ 200 మంది ► జేసీబీలు, ట్రాక్టర్లతో ఇళ్లు, గుడిసెల కూల్చివేత ► అడ్డొచ్చిన మహిళలను చెట్టుకు కట్టేసి చావబాదిన వైనం ► తిరగబడ్డ గొత్తికోయలు.. ► రణరంగంగా మారిన తాడ్వాయి అటవీ ప్రాంతం ► జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన తాడ్వాయి: వారంతా పదేళ్లుగా ఆ అడవిలో నివాసం ఉంటున్నారు.. పోడు వ్యవసాయం చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు.. అడవిని వదలాలంటూ అధికారులు ఎన్నోసార్లు హుకుం జారీ చేసినా పట్టించుకోలేదు.. చివరికి శనివారం ఆ గూడెంలో అధికారగణం దిగింది.. ఒకరిద్దరు కాదు.. ఆ గూడెంలో 36 కుటుంబాలుంటే ఏకంగా 200 మంది సిబ్బంది వచ్చారు.. మూడు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లతో విరుచుకుపడ్డారు.. గుడిసెలు, ఇళ్లను నేలమట్టం చేశారు.. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యానికి దిగారు.. ఎదురుతిరిగిన మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణాæ రహితంగా బాదారు.. అయినా అడవిని వదిలేది లేదని నినాదాలు చేస్తూ వారంతా అక్కడే ఉండిపోయారు.. అటవీ సిబ్బంది గొత్తికోయల ఇళ్లలోని సామగ్రిని ట్రాక్టర్లలో వేసి వేరేచోటుకు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని లవ్వాల అటవీ ప్రాంతం గొత్తికోయలు, ఫారెస్టు సిబ్బంది ఘర్షణతో రణరంగంగా మారింది. గొత్తికోయల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. 100 మంది గొత్తికోయలు.. 200 మంది అటవీ సిబ్బంది.. లవ్వాల సమీపంలో జలగలంచ వద్ద ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలు గూడెం ఏర్పాటు చేసుకుని పదేళ్లుగా నివసిస్తున్నారు. సుమారు 36 కుటుంబాలు ఈ గూడెంలో నివసిస్తున్నాయి. ఇందులో 35 మంది పురుషులు, 40 మంది స్త్రీలు, 25 మంది పిల్లలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తాడ్వాయి, ఏటూరునాగారం, పస్రా రేంజ్‌లతో పాటు పలిమెల, కాటారం, వెంకటాపురం (కే) రేంజ్‌ల నుంచి సుమారు 170 నుంచి 200 మంది అటవీ సిబ్బంది జలగలంచ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. మూడు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లతో ఒక్కసారిగా గుడిసెలు, ఇళ్లు కూల్చివేయడం మొదలుపెట్టారు. ఫారెస్టు అధికారుల దాడితో గూడెంలో ఉన్న పురుషులు చెల్లాచెదురయ్యారు. కొందరు అడవిలోకి పారిపోగా, మరికొందరు గుడిసెలు కూల్చవద్దంటూ మొర పెట్టుకున్నారు. అయినా ఫారెస్టు అధికారులు విచక్షణారహితంగా ఇళ్లు కూల్చడం మొదలెట్టారు. ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది విచక్షణా రహింతగా గొత్తికోయలను కొట్టారు. దీంతో గూడెంలో ఉన్న మహిళలు, పిల్లలు ఏడుపులతో అడవి దద్దరిల్లింది. అందరినీ తీసుకెళ్లి చెట్టుకు కట్టి.. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించకుండా ఇళ్లు నేలమట్టం చేయడం, విచక్షణారహితంగా కొడుతుండటంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై గొత్తికోయ మహిళలు ఎదురు దాడికి దిగారు. దీంతో రెచ్చిపోయిన ఫారెస్టు అధికారులు గొత్తికోయ మహిళలను ఇష్టారాజ్యంగా లాఠీలతో బాదారు. ఎడాపెడా ఈడ్చి పారేశారు. దీంతో గొత్తికోయ మహిళల దుస్తులు చిరిగిపోయాయి. అయినా ఫారెస్టు అధికారులు శాంతించలేదు. సామగ్రిని తరలిస్తున్న ట్రాక్టర్లకు గొత్తికోయ మహిళల అడ్డంగా పడుకున్నారు. వారిని ఫారెస్ట్ సిబ్బంది బలవంతంగా ఈడ్చి పారేశారు. ఓ మహిళను ఇద్దరు మహిళా సిబ్బంది బలవంతంగా పక్కకు తరలించారు. అయినా మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పురుష సిబ్బంది వారిపై దాడి చేశారు. గొత్తికోయ మహిళలందరినీ చెట్టు దగ్గరకి తీసుకెళ్లి చెట్టుకు తాడుతో కట్టేశారు. కుటుంబ పెద్దలు అడవుల్లోకి పారిపోవడం, ఇంట్లో మహిళలు అటవీ సిబ్బంది చేతిలో దెబ్బలు తింటుండటంతో గొత్తికోయ పిల్లలు భీతిల్లారు. పకడ్బందీగా.. కొంతకాలంగా అడవుల్లో ఉన్న గొత్తికోయ గూడేలను ఫారెస్టు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఒక రేంజ్ పరిధిలో గొత్తికోయగూడేన్ని ఖాళీ చేయించాలంటే పక్కన ఉన రేంజ్ సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారంలో తరచుగా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. వాటన్నింటీని తలదన్నెలా శనివారం ఫారెస్టు సిబ్బంది భారీ స్థాయిలో గొత్తికోయగూడెంపై దాడి చేశారు. పోడు సాగుదార్లకు రక్షణ కరువు: చాడ జయశంకర్ భూపాలపల్లి జల్లాలో గొత్తికోయలపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలి: తమ్మినేని గొత్తికోయలపై ఫారెస్టు అధికారులు దుశ్చర్యలకు పాల్పడకుండా చూడాలని, దాడులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. అయినా అడవిని వదల్లేదు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అటవీ సిబ్బంది, గొత్తికోయలకు మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. చివరకు గుడిసెలను తొలగించిన అనంతరం గొత్తికోయల వంట సామగ్రి, దుస్తులు, ఇతర వస్తువులను తాడ్వాయి మండల కేంద్రంలో మేడారం వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడేశారు. అటవీశాఖ అధికారుల దాడులతో గొత్తికోయల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమ సామగ్రిని అటవీ సిబ్బంది తీసుకుపోయినా గొత్తికోయలు అడవి వదలి రాలేదు. కూలిన గుడిసెల మధ్యనే ఉండిపోయారు. పంటలు ధ్వంసం గొత్తికోయలు జీవనోపాధి కోసం సాగు చేసిన మొక్కజొన్న పంటలను సైతం అటవీ సిబ్బంది ధ్వంసం చేశారు. పంట సాగు కోసం ఏర్పాటు చేసుకున్న కుంటలకు గండ్లు పెట్టారు. రెక్కాడితేగానీ డొక్కాడని గొత్తికోయలు కూలీ పనులకు వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించుకుని వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పోడు భూముల్లో వేసిన మొక్కజొన్న పంటలను అటవీ సిబ్బంది ధ్వంసం చేయడంతో వారు ఆర్థికంగా నష్ట పోయారు. గొత్తికోయలపై ఫారెస్టు సిబ్బంది దాడి చేయడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నోటీసులు ఇచ్చినా స్పందించలేదు.. ‘‘జలగలంచ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు 36 కుటుంబాలు పదేళ్లుగా నివాసం ఉంటున్నాయి. అక్కడే అడవిని నరికి పోడు వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని పలుమార్లు చెప్పాం. గుడిసెలను ఖాళీ చేస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీఇచ్చాం. రెండు నెలల క్రితం నుంచి నోటీసులు ఇస్తున్నాం. అయినా మాట వినలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఖాళీ చేయించే ప్రయత్నం చేశాం. కొందరు మహిళలు ట్రాక్టర్ ముందు పడుకుని అడ్డగించారు. అయినా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారిని అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా తాడ్వాయిలో మేడారం వెళ్లే దారి సమీపంలో ఏర్పాటు చేసిన గుడిసెలకు తరలించాం’’ – శిరీష, పస్రా వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి -
జాతీయ పతాకానికి అవమానం!
సాక్షి, కాటారం : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణలో అపశృతి దొర్లింది. ఎగురవేస్తుండగా తాడు నుంచి జాతీయ పతాకం విడివడి గాల్లోకి ఎగిరి కింద పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోటుచేసుకుంది. అయితే వెంటనే తమ పొరపాటును గుర్తించి జెండాను సరిచేసి మరోసారి ఎగురవేశారు. దీనిపై మార్కెట్ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జెండా కర్రను రాత్రి సిద్ధం చేశామని, అయితే తాడును ఎలుకలు ఏమైనా కొరికి ఉండొచ్చునని, దీన్ని గమనించకపోవడం వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. జాతీయ జెండాకు అవమానం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
మహదేవపూర్ అడవుల్లో జింకల వేట