కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం రాంనగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గారె నారాయణ, వెంకటమ్మల కుమార్తె గారె సులోమిని(17) ములుగులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదువుతోంది.
తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు జరుగుతుండటంలో మరస్తాపానికి గురై బలవర్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.