ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య
చౌటుప్పల్:
మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన చీమకండ్ల బుచ్చమ్మ(60) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె గతంలో విషపురుగు కాటుకు గురైంది. నయం కాక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో మనస్తాపం చెంది, సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికని వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.