మైదుకూరు టౌన్ : మైదుకూరు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు కశెట్టి ఓబులేసు(32)కు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఓబులేసు గ్రామం సమీపంలోని తన పొలాల్లో అరటి, పసుపు పంటను సాగు చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టేందుకు పొలం వద్ద ఉన్న విద్యుత్ మోటర్‌ను ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రైతును చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.