విద్యుత్ చౌర్యాన్ని నియంత్రించకపోతే చర్యలు
Published Mon, Oct 17 2016 11:55 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
–నెలాఖరులోగా ఎన్‌టీఆర్ జలసిరి కనెక‌్షన్లు ఇవ్వాలి
– పుష్కర విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు
– ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు హెచ్.వై. దొర
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ చౌర్యాని్న నియంత్రించకపోతే బాధ్యులైనవారిపై చర్యలు తప్పవని విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (తిరుపతి) హెచ్.వై. దొర హెచ్చరించారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్‌లో కర్నూలు సర్కిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా డివిజన్, సబ్‌డివిజన్, సెక‌్షన్ల వారీగా పురోగతి పనులు, ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చౌర్యాన్ని, లైన్ లాస్‌ను నియంత్రించాలన్నారు. ఎన్‌టీఆర్ జలసిరి పథకం కింద మంజూరు అయిన కనెక‌్షన్లను ఈనెలాఖరులోగా మంజూరు చేయాలని సూచించారు. కనెక‌్షన్ లేని ఇల్లు ఉంటే అందుకు ఏఈలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన స్కీము కింద వచ్చిన దరఖాస్తులకు రూ.125కే విద్యుత్ కనెక‌్షన్ ఇవ్వాలన్నారు. ఈ స్కీము కింద కర్నూలుకు 8 సబ్‌స్టేషన్లు మంజూరు అయ్యాయని చెప్పారు. ఆదోని డివిజన్‌లో లైన్‌లాస్‌ను నివారణకు రూ.150కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుష్కర విధుల్లో సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వీరికి ప్రశంసాపత్రాలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టెక్నికల్, హెచ్‌ఆర్ డైరక్టరు పి. పుల్లారెడ్డి, సీఈ పీరయ్య, ఎస్‌ఈ భార్గవ రాముడు, టెక్నికల్, ఆపరేషన్స్ డీఈలు మహమ్మద్ సాధిక్, రమేష్, తిరుపతిరావు, నాగప్ప, ఎస్‌ఏఓ మతృనాయ్, ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement