ఆత్మకూరు రూరల్: ఆ గ్రామంలోని స్కూల్‌కు ఒకే ఉపాధ్యాయుడిని కేటాయించడంపై ఆగ్రహించిన గ్రామస్తులు స్వాతంత్య్ర వేడుకలను బహిష్కరించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం చోటుచేసుకుంది.
ఎన్ని సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. 160 మంది విద్యార్థులు ఉన్న యూపీ స్కూల్‌లో కేవలం ఒక ఉపాధ్యాయుడే విధులు నిర్వహించడంతో తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం గ్రామస్తులు తమ పిల్లలను తరగతుల నుంచి తీసుకెళ్లారు. అదే క్రమంలో 69వ స్వాతంత్ర వేడుకలను బహిష్కరించి నిరసన తెలిపారు.
స్వాతంత్య్ర వేడుకల బహిష్కరణ
Published Sat, Aug 15 2015 10:42 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
Advertisement
Advertisement