అక్కడ వారికి నైట్ పార్టీలు నిషేధం!
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళలకు దుర్వార్త. ఇండిపెండెన్స్ డే వరకు హజ్ ఖాస్ గ్రామంలో లేడీస్ నైట్‌లను నిషేధించాలని పోలీసులు యోచిస్తున్నారు. మహిళల నైట్ పార్టీ కల్చర్‌కు త్వరలోనే చరమగీతం పాడాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా హౌజ్ ఖాస్ లో బార్లు, రెస్టారెంట్లు త్వరలో మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం స్వాతంత్ర్య దినం వరకు హౌజ్ ఖాస్ గ్రామంలో మహిళల రాత్రి నిషేధించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
హౌజ్ ఖాస్ లో నైట్ క్లబ్‌లో మహిళలకు ఉచిత మద్యాన్ని అందిస్తున్న వాటిని తాత్కాలికంగా బ్యాన్ చేయాలని ఢిల్లీ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ కొంతమంది పురుషులు ఒక మహిళను కిడ్నాప్, అత్యాచార యత్నం భయానక సంఘటన నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు మహిళల రాత్రి పార్టీలను నిషేధించాలని భావిస్తున్నారు.
నవభారత్ టైమ్స్ నివేదిక ప్రకారం దీనిపై పోలీసులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పబ్బులు, బార్లలో ఇలాంటి పార్టీల ఏర్పాటు చేయడానికి అనుమతిని నిరాకరించనున్నారు. అంతేకాదు రానున్న మంగళ బుదవారాల్లో హౌసజ్ ఖాస్‌లోలోని మహిళల నైట్ పార్టీలను బ్యాన్ చేయాలని సౌత్ ఢిల్లీ డీసీపీ ఈశ్వర్ సింగ్ ఆదేశించారు. సంబంధిత పోలీసు స్టేషన్ హెడ్ లకు కూడా సూచనలు జారీ చేశారు దాదాపు ఇలాంటి అన్ని క్లబ్లులకు ఇలాంటి ఆదేశాలను జారీ చేయనున్నారట.