Delhi women
-
మహిళా కాలేజీని చుట్టుముట్టి.. గోడ దూకి రచ్చ రచ్చ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మిరాండా హౌస్ మహిళా కళాశాలలో ఈనెల 14న నిర్వహించిన దీపావళి మేలా ఉద్రిక్తతంగా మారింది. క్యాంపస్‌లో వేడుకలు జరుగుతున్న క్రమంలో కళాశాల వద్దకు చేరుకున్న పదుల సంఖ్యలో పోకిరీలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా నినాదాలు చేయటం, గోడలు, గేట్లు దూకి లోపలికి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీపావళి వేడుక ప్రారంభమైన ఒక గంట సమయంలోనే.. మహిళా కళాశాల చుట్టూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. పోకిరీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించలేమని గ్రహించిన కళాశాల యాజమాన్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘క్యాంపస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో చాలా మంది పురుషులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. లోపలికి అనుమతించాలని అసభ్యకరంగా నినాదాలు చేశారు. గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. లోపలికి ప్రవేశించిన కొందరు మహిళల తరగతి గదుల వంటి నిషేధిత ప్రాంతాలను ఆక్రమించారు. ప్రొఫెసర్స్, స్టాఫ్ మాటలను సైతం లెక్కచేయలేదు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కళాశాలలో ఇష్టానుసారం వ్యవహరించారు.’ అని కళాశాల విద్యార్థి సంఘం ఓ ప్రకటన చేసింది. పురుషులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, వేధింపులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. క్యాంపస్‌లోకి వచ్చిన పోకిరీలు.. అక్కడి మహిళలను తమ కోరికలు తీర్చే వస్తువులుగా పేర్కొన్నారని, దాంతో విద్యార్థినులు భయంతో పరుగులుతీసినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోల ఆధారంగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రకటించారు. ఈ సంఘటన అక్టోబర్ 14న జరిగినట్లు తెలిపారు. Men climbing over the walls to get into Miranda House during an open fest. What followed was horrible. Cat-calling, groping, sexist sloganeering and more. Men entering safe spaces to harass gender minorities is nothing new, but they out do themselves every time. pic.twitter.com/UkMAuJZKVU — Sobhana (@sobhana__) October 15, 2022 ఇదీ చదవండి: నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర! -
‘సరి-బేసి’ నుంచి వారికి మినహాయింపు: సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సరి-బేసి’ వాహన విధానం నుంచి మహిళలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న మూడో విడత సరి-బేసి విధానంలో మహిళలకు మినహాయింపు ఇచ్చినట్లు శనివారం వెల్లడించారు. ఒంటరిగా కారును నడిపే మహిళలు, 12 ఏళ్ల చిన్నారులతోపాటు ఉన్న మహిళలు, కారులో మొత్తం మహిళలు ఉన్నా కూడా సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే గతంలో సీఎన్జీ ప్రైవేటు వాహనాలపై ఇచ్చిన మినహాయింపును తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సీఎన్జీ స్టిక్కర్లతో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ద్విచక్ర వాహనదారులకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై నిపుణులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
అక్కడ వారికి నైట్ పార్టీలు నిషేధం!
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళలకు దుర్వార్త. ఇండిపెండెన్స్ డే వరకు హజ్ ఖాస్ గ్రామంలో లేడీస్ నైట్లను నిషేధించాలని పోలీసులు యోచిస్తున్నారు. మహిళల నైట్ పార్టీ కల్చర్‌కు త్వరలోనే చరమగీతం పాడాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా హౌజ్ ఖాస్ లో బార్లు, రెస్టారెంట్లు త్వరలో మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం స్వాతంత్ర్య దినం వరకు హౌజ్ ఖాస్ గ్రామంలో మహిళల రాత్రి నిషేధించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. హౌజ్ ఖాస్ లో నైట్ క్లబ్లో మహిళలకు ఉచిత మద్యాన్ని అందిస్తున్న వాటిని తాత్కాలికంగా బ్యాన్ చేయాలని ఢిల్లీ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ కొంతమంది పురుషులు ఒక మహిళను కిడ్నాప్, అత్యాచార యత్నం భయానక సంఘటన నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు మహిళల రాత్రి పార్టీలను నిషేధించాలని భావిస్తున్నారు. నవభారత్ టైమ్స్ నివేదిక ప్రకారం దీనిపై పోలీసులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పబ్బులు, బార్లలో ఇలాంటి పార్టీల ఏర్పాటు చేయడానికి అనుమతిని నిరాకరించనున్నారు. అంతేకాదు రానున్న మంగళ బుదవారాల్లో హౌసజ్ ఖాస్లోలోని మహిళల నైట్ పార్టీలను బ్యాన్ చేయాలని సౌత్ ఢిల్లీ డీసీపీ ఈశ్వర్ సింగ్ ఆదేశించారు. సంబంధిత పోలీసు స్టేషన్ హెడ్ లకు కూడా సూచనలు జారీ చేశారు దాదాపు ఇలాంటి అన్ని క్లబ్లులకు ఇలాంటి ఆదేశాలను జారీ చేయనున్నారట. -
ఆత్మరక్షణపై మహిళలకు వర్క్‌షాప్
న్యూఢిల్లీ: ‘మీపై ఎవరైనా దాడి చేస్తే భయపడకండి. వెంటనే కళ్లు తదితర సున్నిత భాగాలపై కొట్టండి. చిమ్మచీకటిగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తాల్సి వస్తే మీ వెంట పెప్పర్ స్త్రేని ఉంచుకోండి. ప్రతిఘటించేందుకు పిడికిళ్లను ఉపయోగించకండి. మోకాళ్లను మాత్రమే వినియోగించండి’ ఇలా అనేక విలువైన సలహాలు, సూచనలను నిపుణులు మహిళలకు తెలియజేశారు. మహిళల భద్రతకు సంబంధించి మంగళవారం నగరంలో మంగళవారం ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ‘ఉమెన్ సేఫ్టీ అండ్ సర్వైవల్’ పేరిట ఈ కార్యక్రమం అమెరికాకు చెందిన ఓ సంస్థ సహకారంతో స్థానిక స్వచ్ఛంద నేతృత్వంలో జరిగింది. ‘ఓ మహిళపై దాడి జరిగినపుడు ఏవిధంగా ప్రతిఘటించాలో ఆమెకు తెలియదు. అందువల్ల వారికి తగు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’అని స్ట్రీట్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రాం (ఎస్ఎల్ఏపీ) సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు మృగంకా దడ్వాల్ పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా దాడికి గురికావచ్చనీ, దానిని తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఇటువంటి శిక్షణ పొందినట్టయితే వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందన్నారు. ‘నాపై దాడి జరగదనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఒకవేళ దాడి జరిగితే పెప్పర్ స్ప్రేని ఎలా ఉపయోగిస్తాననే అంశం నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది’ అని ఈ కార్యక్రమానికి హాజరైన వాణి మెహతా పేర్కొంది. మరో మహిళ దడ్వాల్ మాట్లాడుతూ సరైన సమయంలో సరయిన విధంగా వ్యవహరించాలి. చిమ్మచీకటిగా ఉండే ప్రాంతంలో వెళ్లాల్సి వచ్చినపుడు పెప్పర్ స్ప్రేని ఉంచుకోవాలి. అది ఎంతగానో ఉపయోగపడుతుంది.’అని పేర్కొంది.