సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సరి-బేసి’ వాహన విధానం నుంచి మహిళలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న మూడో విడత సరి-బేసి విధానంలో మహిళలకు మినహాయింపు ఇచ్చినట్లు శనివారం వెల్లడించారు. ఒంటరిగా కారును నడిపే మహిళలు, 12 ఏళ్ల చిన్నారులతోపాటు ఉన్న మహిళలు, కారులో మొత్తం మహిళలు ఉన్నా కూడా సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే గతంలో సీఎన్‌జీ ప్రైవేటు వాహనాలపై ఇచ్చిన మినహాయింపును తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సీఎన్‌జీ స్టిక్కర్లతో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ద్విచక్ర వాహనదారులకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై నిపుణులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
‘సరి-బేసి’ నుంచి వారికి మినహాయింపు: సీఎం
Published Sat, Oct 12 2019 9:02 PM | Last Updated on Sat, Oct 12 2019 9:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment