Hauz Khas Village
-
యువతులతో అసభ్య ప్రవర్తన.. రేటెంత అంటూ..
న్యూఢిల్లీ: రాత్రి సమయంలో అమ్మాయిలు బయట కనిపిస్తే చాలు.. కొంతమంది కుసంస్కారులు.. వారి వ్యక్తిత్వాన్ని తప్పుగా అంచనా వేసి కించపరిచే విధంగా మాట్లాడతారు. ఆధునిక కాలంలో పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఢీకొట్టలేక అప్పుడప్పుడు తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుంటారు. ఢిల్లీలోని హజ్‌ఖాస్ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. మధ్య వయస్కులైన కొంతమంది మగవాళ్లు.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ జాత్యహంకారపూరితంగా వ్యవహరించారు. జూలై 18న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఉన్న వివరాల ప్రకారం... ‘‘స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు హజ్ఖాస్కు వెళ్లాం. రాత్రి 10 గంటల సమయం... పబ్ నుంచి బయటకు వచ్చాక క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడే కొంతమంది పురుషులు మా వద్దకు వచ్చారు. వాళ్లకు 40- 45 ఏళ్లు ఉంటాయి. అందులో ఒకరు నా దగ్గరకు వచ్చారు. కార్లో ఎక్కడానికి వచ్చారనుకున్నా. కానీ.. అతడు ‘క్యా రేట్ హై(రేటెంత)’ అని అడిగాడు. మేం షాకయ్యాం. భయ్యా అసలు మీకేమైంది. ఎందుకిలా మాట్లాడుతున్నారని అడిగాం. కోపంతో గట్టిగా అరిచాం. వాళ్లు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు’’అని తమకు ఎదురైన చేదు అనుభవం గురించి బాధితులు పంచుకున్నారు. -
ఏటీఎం దగ్గర కి‘లేడీ’ల చేతివాటం..
న్యూఢిల్లీ: ఏటీఎమ్ వద్ద మాజీ సైనికుడి నుంచి డబ్బులు దొంగిలించినందుకు ముగ్గురు మహిళలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ గ్రామంలో నివసిస్తున్న 73 ఏళ్ల వ్యక్తి ఏటీఎమ్ నుంచి రూ.40,000 విత్‌డ్రా చేసి బయటకు వస్తున్న సమయంలో ముగ్గురు మహిళలు ఆయనను అడ్డుకొని బెదిరించి జేబులో నుంచి డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు. ఆ సమయంలో ఏటీఎమ్‌లో, చుట్టుపక్కలా ఎవరూ లేకపోవడంతో నిరాశ్రయుడైన ఆ వృద్ధుడు చూస్తూ ఉండిపోయాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎమ్‌లో డబ్బులు తీస్తున్న సమయంలో ఇద్దరు మహిళలు ఏటీఎమ్‌లోకి వచ్చారని.. వారిని బయట నిల్చొమని చెప్పినా వినలేదని.. అక్కడ సమయానికి ఎవరు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయానని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా ఆ ముగ్గురి నిందితుల బాగోతం బయటపడింది. అనంతరం ముగ్గురు మహిళలు దొంగింలించిన డబ్బులను పంచుకోడానికి ఓ పార్కులోకి వచ్చారని సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన మొత్తాన్ని పోలీసులు బాధితుడికి అందించారు. నిందితులు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లకు చెందిన వారని, వీరికి మరో కేసుతో కూడా సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. పండగలు, వేడుకలు వంటి సీజన్లలో నగరానికి వచ్చి రద్దీ ఎక్కువగా ఉండే బ్యాంకులు, మార్కెట్లు, ఏటీఎమ్ ప్రదేశాలలో సంచరించి అనుకూలంగా ఉన్న సమయంలో ఇలా వ్యక్తుల నుంచి డబ్బులు, ఆభరణాలు దొంగిలిస్తారని పోలీసులు తెలిపారు. -
పబ్‌లో పరిచయం.. ఇంటికి పిలిచాడని వెళ్తే..
న్యూఢిల్లీ : ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 24 గంటల్లోపే పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కెనడాకు చెందిన ఓ మహిళ మంగళవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని హాజ్ ఖాస్ ఏరియాలో ఓ పబ్‌కు వెళ్లారు. అదే పబ్‌కు వచ్చిన అభిషేక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఫ్రెండ్స్‌గా మారడంతో అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహితులతో కలిసి బాధితురాలు ఆరోజు ఇంటికి వెళ్లిపోయారు. ఆ మరుసటిరోజు నిందితుడు అభిషేక్, కెనడా స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించాడు. ఫ్రెండ్ అని అభిషేక్‌ను నమ్మి అతడి ఇంటికి వెళ్లగా.. అదే అదనుగా భావించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి బయటపడ్డ ఆ మహిళ నేరుగా ఎయిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడినుంచే ఫోన్ చేసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఆపై బాధితురాలు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో నిందితుడు అభిషేక్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు హాజ్ ఖాస్ పోలీసులు వివరించారు. -
అక్కడ వారికి నైట్ పార్టీలు నిషేధం!
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళలకు దుర్వార్త. ఇండిపెండెన్స్ డే వరకు హజ్ ఖాస్ గ్రామంలో లేడీస్ నైట్లను నిషేధించాలని పోలీసులు యోచిస్తున్నారు. మహిళల నైట్ పార్టీ కల్చర్‌కు త్వరలోనే చరమగీతం పాడాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా హౌజ్ ఖాస్ లో బార్లు, రెస్టారెంట్లు త్వరలో మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం స్వాతంత్ర్య దినం వరకు హౌజ్ ఖాస్ గ్రామంలో మహిళల రాత్రి నిషేధించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. హౌజ్ ఖాస్ లో నైట్ క్లబ్లో మహిళలకు ఉచిత మద్యాన్ని అందిస్తున్న వాటిని తాత్కాలికంగా బ్యాన్ చేయాలని ఢిల్లీ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ కొంతమంది పురుషులు ఒక మహిళను కిడ్నాప్, అత్యాచార యత్నం భయానక సంఘటన నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు మహిళల రాత్రి పార్టీలను నిషేధించాలని భావిస్తున్నారు. నవభారత్ టైమ్స్ నివేదిక ప్రకారం దీనిపై పోలీసులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పబ్బులు, బార్లలో ఇలాంటి పార్టీల ఏర్పాటు చేయడానికి అనుమతిని నిరాకరించనున్నారు. అంతేకాదు రానున్న మంగళ బుదవారాల్లో హౌసజ్ ఖాస్లోలోని మహిళల నైట్ పార్టీలను బ్యాన్ చేయాలని సౌత్ ఢిల్లీ డీసీపీ ఈశ్వర్ సింగ్ ఆదేశించారు. సంబంధిత పోలీసు స్టేషన్ హెడ్ లకు కూడా సూచనలు జారీ చేశారు దాదాపు ఇలాంటి అన్ని క్లబ్లులకు ఇలాంటి ఆదేశాలను జారీ చేయనున్నారట.