న్యూఢిల్లీ : ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 24 గంటల్లోపే పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం..
కెనడాకు చెందిన ఓ మహిళ మంగళవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని హాజ్ ఖాస్ ఏరియాలో ఓ పబ్‌కు వెళ్లారు. అదే పబ్‌కు వచ్చిన అభిషేక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఫ్రెండ్స్‌గా మారడంతో అడ్రస్‌లు, ఫోన్ నెంబర్‌లు ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహితులతో కలిసి బాధితురాలు ఆరోజు ఇంటికి వెళ్లిపోయారు.
ఆ మరుసటిరోజు నిందితుడు అభిషేక్, కెనడా స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించాడు. ఫ్రెండ్ అని అభిషేక్‌ను నమ్మి అతడి ఇంటికి వెళ్లగా.. అదే అదనుగా భావించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి
బారి నుంచి బయటపడ్డ ఆ మహిళ నేరుగా ఎయిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడినుంచే ఫోన్ చేసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఆపై బాధితురాలు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో నిందితుడు అభిషేక్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు హాజ్ ఖాస్ పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment