Woman abused
-
పబ్‌లో పరిచయం.. ఇంటికి పిలిచాడని వెళ్తే..
న్యూఢిల్లీ : ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 24 గంటల్లోపే పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కెనడాకు చెందిన ఓ మహిళ మంగళవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని హాజ్ ఖాస్ ఏరియాలో ఓ పబ్‌కు వెళ్లారు. అదే పబ్‌కు వచ్చిన అభిషేక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఫ్రెండ్స్‌గా మారడంతో అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహితులతో కలిసి బాధితురాలు ఆరోజు ఇంటికి వెళ్లిపోయారు. ఆ మరుసటిరోజు నిందితుడు అభిషేక్, కెనడా స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించాడు. ఫ్రెండ్ అని అభిషేక్‌ను నమ్మి అతడి ఇంటికి వెళ్లగా.. అదే అదనుగా భావించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి బయటపడ్డ ఆ మహిళ నేరుగా ఎయిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడినుంచే ఫోన్ చేసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఆపై బాధితురాలు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో నిందితుడు అభిషేక్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు హాజ్ ఖాస్ పోలీసులు వివరించారు. -
బెంగళూరులో రెచ్చిపోయిన పోకిరీలు
బనశంకరి (బెంగళూరు): ఐటీ సిటీ బెంగళూరులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు వేధింపులకు దిగుతున్నారు. తాజాగా రోడ్డుపై క్యాబ్ కోసం వేచిచూస్తున్న యువతిపై ముగ్గురు దుండగులు కీచకపర్వానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎంజీ రోడ్డులోని హోటల్లో ఓ యువతి పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ కోసం వేచి చూస్తోంది. ఈ సమయంలో బైకులో వచ్చిన ముగ్గురు దుండగులు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు లాగేయడానికి ప్రయత్నించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమె బ్యాగ్‌లో ఉన్న ఐఫోన్‌ను లాక్కుని ఉడాయించారు. రోదిస్తున్న యువతిని గమనించిన ఉబర్ క్యాబ్ డ్రైవర్లు బాధితురాలిని సమీప హలసూరు పీఎస్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కారును అడ్డుకుని మహిళపై దాడి మరో ఘటనలో పట్టపగలే నడిరోడ్డుపై కొందరు పోకిరీలు ఒక మహిళ దుస్తులు లాగి వేధించారు. బెంగళూరు కుమారస్వామి లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 19 తేదీ మధ్యాహ్నం ఒక మహిళ కారులో వెళ్తుండగా, కొందరు యువకులు ఆమె కారును అడ్డుకున్నారు. ఆమె కారు దిగుతుండగానే దుస్తులు లాగి కారును ధ్వంసం చేసి సెల్‌ఫోన్‌ను లాక్కుని పరారయ్యారు.