అనంతపురం సిటీ : కాపులను బీసీ జాబితాలో చేర్చితే ఇక తరాలు మారినా బీసీల బతుకులు మాత్రం మారవని ఏపీబీసీ ఎంప్లాయీస్ అసోషియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ అథితి గహంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా చంద్రమోహన్, సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రధర్‌యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ 1968లో అనంత రామన్ కమిషన్, 1982లో మురళీధర్‌రావ్ కమిషన్లు కాపులను బీసీల జాబితాలో చేర్చడానికి నిరాకరించారని గుర్తుచేశారు. బీసీలు ఇప్పుడిప్పుడే అభివద్ధి పథాన అడుగులేస్తున్నారని, ఈ సమయంలో అన్ని రంగాల్లో ముందున్న కాపులను తీసుకువచ్చి బీసీల్లో చేర్చితే తమకు తీరని అన్యాయం చేసిన వారవుతారని విచారం వ్యక్తం చేశారు.
........................................
మంజునాథ కమిషన్ దృష్టికి తీసుకెళ్లండి
అనంతపురం సిటీ : జిల్లాలో వేలాది మంది బలిజ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధికి నోచుకోక దుర్భర పరిస్థితుల్లో జీవితాలు వెల్లదీస్తున్నారని అనంతపురం కాపు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ ఈ జిల్లాలో చాలా మంది బలిజలు గందోడి, గాజులు, కాయగూరలు, పండ్లు, పూలను తోపుడు బండ్లపై అమ్ముకుంటూ జీవిస్తున్నారన్నారు. భవన నిర్మాణ కూలీలు, మెకానిక్‌లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఆటో కార్మికులుగా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారన్నారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమను బీసీల జాబితాలో చేర్చాలని మంజునాథ కమిషన్‌కు మీ కుల సంఘం తరపున వినతిపత్రం ఇవ్వాలని కోరారు.
కాపులను చేర్చితే నష్టపోయేది బీసీలే!
Published Fri, Oct 14 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
Advertisement
Advertisement