ఖాజీపేట: ఖాజీపేట మండలం అగ్రహారం సొసైటీ అక్రమాలపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. ‘అగ్రహారం సొసైటీ అక్రమాలపై విచారణ ఎప్పడు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా గురువారం ఖాజీపేటలోని అగ్రహారం సొసైటీకి హబీబుల్లా, రమేష్, సుగుణమ్మ అనే ముగ్గురు ఆడిటర్లు వచ్చారు. సొసైటీలోని ప్రాథమిక సమాచారాన్ని సీఈఓ సుధాకర్‌ను అడిగి తీసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సొసైటీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 1195 మంది రైతులకు రూ.10కోట్ల 60లక్షల రుణాలను అందించారన్నారు. రుణాలకు సంబంధించిన రికార్డులను తమకు అప్పగిస్తే పరిశీలిస్తామని తెలిపారు.
పంపులపై ఫిర్యాదు చేస్తే చర్యలు..
సొసైటీ వారు తైవాన్ పంపులను రైతులకు బలవంతంగా ఇచ్చారన్న దానిపై వారు స్పందిస్తూ రైతులు ఎవరైనా తైవాన్ పంపులపై గానీ, ఎంత రుణం ఇచ్చారు.. రైతులకు ఎంత ముట్టింది అన్న దానిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
విచారణకు వారం గడువు ఇవ్వండి
సొసైటీలో రికార్డులన్నీ సక్రమంగా ఉంచేందుకు తమకు వారం రోజులు గడువు కావాలని ఆడిటర్లను సొసైటీ సిబ్బంది అడిగారు. అందుకు వారు నిరాకరించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటాం, అవకాశం ఇవ్వండి అని అడగడంతో కొద్ది సేపు తర్వాత ఆడిటర్లు వెళ్లిపోయారు.
ఎందుకు వచ్చినట్లు.. ఎందుకు వెళ్లినట్లు..
విచారణ కోసం వచ్చిన అధికారులు నామమాత్రంగా విచారించి Ðð ళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు వచ్చిన వారు రికార్డులను స్వాధీనం చేసుకుని విచారించాలి కాని ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రుణాలు పొందిన రైతులందరిని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.
అగ్రహారం సొసైటీ అక్రమాలపై విచారణ మొదలు
Published Thu, Sep 15 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
Advertisement
Advertisement